One Nation One Student : దేశంలో మరో నూతన పథకం.. వన్ నేషన్ వన్ స్టూడెంట్ స్కీం..
దేశంలో ఇప్పటి వరకు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు.. ఇప్పుడు అదే తరహాలో వన్ నేషన్ వన్ స్టూడెంట్.. పథకం తీసుక రాబోతుంది భారత ప్రభుత్వం.

Another new scheme has been implemented for students across India It is One Nation One Student Card
దేశంలో ఇప్పటి వరకు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు.. ఇప్పుడు అదే తరహాలో వన్ నేషన్ వన్ స్టూడెంట్.. పథకం తీసుక రాబోతుంది భారత ప్రభుత్వం.
భారత్ దేశం వ్యాప్తంగా విద్యార్థులకు మరో నూతన పథకం అమలు.. అదే ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’.. ఆధార్ కార్డు తరహాలోనే దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డును తయారు చేసి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు అమలు కసరత్తు చేస్తుంది. దేశంలో ఉన్న ప్రతి పాఠశాల విద్యార్థులందరికీ ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఒకే గుర్తింపు కార్డును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం NEP 2020 లో భాగంగా ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి’ పథకం అమలు చేయబడుతోంది. ముందుగా దేశ వ్యాప్తంగా అపార ఐడీ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నంబర్‌ను.. ఈ పథకాన్ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ – ఏపీఏఏఆర్ (APAAR) అంటారు.
అపార్ ఐడీ అంటే ఏమిటీ ..?
అపార్ నంబర్‌ను విద్యార్థులకు జీవితకాల గుర్తింపు కార్డు ఐడీగా పరిగణిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్ ఐడీ నంబర్ ను ఇవ్వనున్నారు. ఈ ఐడీ కార్డులో విద్యార్థి బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు, వర్ణం, భాష, ప్రాంతం అకడమిక్ ప్రయాణం, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అవుతాయని, అవసరమైన సమయం విద్యార్థికి సంబంధించిన విషయాలు అందుబాటులో ఉంటాయి. ప్రీ ప్రైమరీ తరగతుల నుంచి హయ్యర్ సెకండరీ పాఠశాలల వరకు విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. అపార్ ఉంటుంది, ఇది EduLockerగా పరిగణించబడుతుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన ID ఉంటుంది, అది వారి విద్యాపరమైన అభివృద్ధి, విజయాలు అందులో నమోదు చేస్తారు. విద్యార్థి ఏదో ఒక సందర్భంలో కిడ్నాప్ కి గురైతే.. ఈ ఆధారాలతో విద్యార్థిని ట్రాక్ చేసి సేవ్ చేయవచ్చు. ఇతర సమాచారాన్ని కూడా ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
వన్ ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి’ పథకం అమలు పై తల్లిదండ్రులతో చర్చలు..
అపార కార్డ్‌పై చర్చించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖలు విద్యాసంస్థలను ఆదేశించాయి. ఈ పథకం అమలుపై తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలని కేంద్రం అన్ని పాఠశాలలను కోరింది. అక్టోబరు 16 నుంచి 18వ తేదీ మధ్య సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పిల్లల బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు వంటి సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వ విద్యా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో అందించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం కోరింది. అపార కార్డ్ దేశంలోని విద్యార్థులందరికీ కొత్త QR కోడ్ అవుతుంది. అని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE చైర్మన్ TG సీతారామన్ అన్నారు.
ఈ అపార తో విద్యార్థుల డాటా రహస్యంగా ఉంటుందా..?
నిజానికి ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టుకతో సహ అన్ని విషయాలను అపార ఐడీ కార్డులో నమోదు అవుతుంది. ఈ సమాచారం అంత ఎలా భద్రపరుస్తారు.
- విద్యార్థుల డాలా ను రహస్యంగా ఉంటుందా..?
- ఒకవేళ తమ విద్యార్థుల సమచారం బహిర్గతం అయితే పిల్లల భవిష్యత్ ఏంటి.. ?
అని తల్లిదండ్రులు ఒకింత ఆందోళన మొదలైంది. కానీ వీటన్నింటికీ కేంద్ర విద్యా శాఖ సమాధానం ఇచ్చింది. విద్యార్థుల డేటా రహస్యంగా ఉంటుంది, ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే పంచుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ’ స్కీమ్‌పై ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామన్ మాట్లాడుతూ ఆపార్, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ దేశంలోని విద్యార్థులకు క్యూఆర్ కోడ్ మాదిరిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి నేర్చుకొన్న ప్రతి నైపుణ్యం, సాధించిన విజయం అందులో నమోదు చేస్తాము అని అన్నారు.
S.SURESH