ప్రపంచం మైకి మరో మహమ్మారి, ల్యాబ్ నుంచి వైరస్ లీక్
మానవ సమజాన్ని కరోనా పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ రోజులను తలుచుకుంటే ప్రజలు ఇంకా వణికిపోతున్నారంటే.. ఏ స్థాయిలో ఆ మహమ్మారి మనుషులను భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆ భయాలను ప్రజలు మరిచిపోతున్నారు.
మానవ సమజాన్ని కరోనా పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ రోజులను తలుచుకుంటే ప్రజలు ఇంకా వణికిపోతున్నారంటే.. ఏ స్థాయిలో ఆ మహమ్మారి మనుషులను భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆ భయాలను ప్రజలు మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో వందలాది ప్రాణాంతక వైరస్ సాంపిల్స్ ల్యాబ్‌లోంచి మాయమవడం కలకలం రేపుతోంది. అత్యంత ప్రమాదకరమైన వైరస్ సాంపిల్స్ ల్యాబ్ లోంచి కనిపించకుండా పోయాయి. ఇలా ఒకటిరెండు కాదు వందలాది ప్రాణాంతక వైరస్ సాంపిల్స్ మిస్సయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వైరస్ సాంపిల్స్ మిస్సింగ్‌పై క్విన్స్ ల్యాండ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఇలా ల్యాబ్ నుండి కనిపించకుండా పోయిన వాటిలో హెండ్రా, లిస్సా, హంటా వంటి ప్రమాదకర వైరస్ సాంపిల్స్ వున్నాయి. ఇలా క్వీన్స్ ల్యాండ్‌లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ లాబోరేటరీ నుంచి గత ఏడాది 2023 అగస్ట్ లోనే ఈ సాంపిల్స్ మిస్సయినట్లు తెలిపారు. ఇలా మొత్తం 323 వైరస్ సాంపిల్స్ మిస్ అయినట్లు తెలిపారు.
ఈ వైరస్ సాంపిల్స్ మిస్సింగ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. క్విన్స్ ల్యాండ్ హెల్త్ డిపార్ట్ మెంట్‌తో పాటు ఆ దేశ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. క్వీన్స్ ల్యాండ్ ల్యాబ్ నుండి మిస్ అయిన వైరస్ శాంపిల్స్‌లో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి వున్నాయి. ఇందులో హెండ్రా వైరస్ ఒకటి. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది కేవలం ఆస్ట్రేలియాలోనే గుర్తించబడింది. మరో వైరస్ హెంటా ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనంచేసి మరణానికి కూడా కారణం అవుతుంది. ఇక లిస్సా వైరస్ రేబిస్ వ్యాధికి కారణమయ్యే వాటిలో ఒకటి. ఇలాంటి వైరస్‌లు మిస్సవడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ వైరస్ శాంపిల్స్ ల్యాబ్ నుంచి దొంగిలించబడ్డాయా లేక ధ్వంసం చేసారా అన్నది తెలియాల్సి వుంది. ఇప్పటి వరకూ ఈ సాంపిల్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రజారోగ్యం దృష్ట్యా ఈ వైరస్ శాంపిల్స్ ఏమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం.