Delhi Liquor Scam, KCR : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం… ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరు..
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR) పాత్ర ఉన్నట్లు ఈడీ (ED) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది

Another sensation in Delhi Liquor Scam...KCR's name in Delhi Liquor Scam..
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR) పాత్ర ఉన్నట్లు ఈడీ (ED) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లిక్కర్ స్కాం గురించి కేసీఆర్కు ముందే తెలుసని ఈడీ పేర్కొంది. ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీం సభ్యులను పరిచయం చేశారని వెల్లడించింది. వ్యాపారం గురించి వారి వద్ద వివరాలు కేసీఆర్ తెలుసుకున్నారని వివరించింది. ఢిల్లీలోని తన నివాసంలో.. ఎమ్మెల్సీ కవిత (MLC’s Kavitha) .. సమీర్ మహేంద్ర (Sameer Mahendra) తో పాటుగా బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లైను.. కేసీఆర్ కు పరిచయం చేయించింది. ఢిల్లీ మద్యం వ్యాపారం, పెట్టుబడులు, రిటైల్ వ్యాపారంపై వివరాలను సమీర్ మహేంద్రును కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ స్కాంలో డబ్బులు ముట్టజెప్పిన విషయంతో పాటు… కేసిఆర్‌తో భేటీ వివరాలపై గోపీ కుమరన్ వాంగ్మూలంను ఈడీ బయటపెట్టింది.