టీమిండియాకు మరో షాక్ రిషబ్ పంత్ కు గాయం
బెంగళూరు టెస్టులో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే గిల్ మెడనొప్పితో దూరమవగా... మ్యాచ్ ఆడుతూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడాడు.
బెంగళూరు టెస్టులో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే గిల్ మెడనొప్పితో దూరమవగా… మ్యాచ్ ఆడుతూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియోలు వచ్చి పంత్‌ను పరీక్షించారు.
అయితే, బాధ తాళలేక పంత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడు మైదానం వీడడంతో సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఒకవేళ పంత్ రెండో ఇన్నింగ్స్ సమయానికి కోలుకోకపోతే టీమిండియాకు ఎదురుదెబ్బగానే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో పంత్ మాత్రమే 20 రన్స్ చేశాడు. అయితే పంత్ విషయంలో తాము రిస్క్ చేయమని రోహిత్ క్లారిటీ ఇచ్చేసాడు. దీనితో న్యూజిలాండ్ సీరీస్ కి పంత్ ను పక్కన్న పెట్టె అవకాశం ఉంది.