టీమిండియాకు మరో షాక్, టెస్ట్ ర్యాంకింగ్స్ లో మూడో ప్లేస్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా 109 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానానికి పడిపోవడం తొమ్మిదేళ్ళ తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 2016లో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌పై ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం ఆసీస్‌కు కలిసి రాగా.. పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది.