Chandramohan passed away : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ హీరో నటుడు ( మల్లంపల్లి చంద్రశేఖర రావు ) చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు.

Another tragedy in Tollywood industry Popular actor Chandramohan passed away
టాలీవుడ్ ప్రముఖ హీరో నటుడు (Chandramohan) ( మల్లంపల్లి చంద్రశేఖర రావు ) చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు.
అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకులను అలరించాడు. చంద్రమోహన్ హీరోగా 175 సినిమాలు చేసి.. మొత్తం 932 మూవీస్ లో నటించారు.
హీరో, హ్యాస్యనటుడు, కేరక్టర్ ఆర్టిస్ట్ గా వివిధ పాత్రల్లో నటన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఆనారోగ్య కారణాలతో ఇవాళ ఉదయం అపోలో హాస్పట్ లో చికిత్స పొందుతు కనుమూశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి.