Pravalika Case : ప్రవళిక కేసులో మరో మలుపు.. తెరమీదకు శివరాం తల్లిదండ్రులు..
రీంసెట్‌గా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గ్రూప్స్ వాయిదా పడ్డ కారణంగానే ప్రవళిక చనిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రేమ వ్యవహరం కారణమని పోలీసులు చెప్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు మరింత సీరియస్ అయ్యారు. కేసును తప్పుదారి పట్టించేందుకు అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చ వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. చిరవకి ప్రవళిక తల్లి స్పందనతో కథ మొత్తం మలుపు తిరగింది.

Another turning point in Pravalika case Shivarams parents on screen
రీంసెట్‌గా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గ్రూప్స్ వాయిదా పడ్డ కారణంగానే ప్రవళిక చనిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రేమ వ్యవహరం కారణమని పోలీసులు చెప్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు మరింత సీరియస్ అయ్యారు. కేసును తప్పుదారి పట్టించేందుకు అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చ వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. చిరవకి ప్రవళిక తల్లి స్పందనతో కథ మొత్తం మలుపు తిరగింది. నిజానికి ప్రవళిక తల్లి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రవళిక చనిపోయిందంటూ ఆరోపించింది. కానీ ప్రగతిభవన్ వెళ్లి వచ్చిన తరువాత తన కూతురు చావుకు శివరాం అనే యువకుడు కారణమంటూ బాంబు పేల్చింది. ప్రేమ పేరుతో శివరాం రాథోడ్ అనే యువకుడు తన కూతుర్ని వేధించేవాడని చెప్పింది. ఆ వేధింపులు భరించలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని.. శివరాంను కఠినంగా శిక్షించాలంటూ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యింది. దీంతో కథ మొత్తం మలుపు తిరిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు శివరాం తల్లిదండ్రులు తెరపైకి వచ్చారు. శివరాం, ప్రవళిక విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. ఈ కేసులో శివరాం పేరు బయటికి వచ్చినప్పటి నుంచి తాము మానసికంగా కుంగిపోతున్నామంటూ చెప్పారు. దీనికి తోడు పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడు. దీంతో శివరాం ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజూ పోలీసులు ఇంటికి వచ్చి తమను వేధిస్తున్నారంటూ శివరాం తల్లిదండ్రులు మానవహక్కుల కమీషన్‌ను ఆశ్రయించారు. పోలీసుల వేధింపుల నుంచి తమకు ఉపశమనం కల్పించాలంటూ కోరుతున్నారు.