BRS : కేసీఆర్‌ టీంలో మరో వికెట్‌ డౌన్‌.. యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలనలో అధికారుల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. కొందరు ట్రాన్స్‌ఫర్ల మీద వెళ్తుంటే కొందరు మాత్రం ఏకంగా రాజీనామా చేస్తున్నారు. చేస్తున్నారు అనడం కంటే.. సీఎం రేవంత్‌ రెడ్డి వాళ్లను పీకి పడేస్తున్నారు అనడం కరెక్ట్‌గా ఉంటుంది. గత ప్రభుత్వంలో అధికారాన్ని మించి కేసీఆర్‌ కోసం పనిచేసిన అందరు అధికారులు వరుసగా పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో.. గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 03:46 PMLast Updated on: Dec 21, 2023 | 3:46 PM

Another Wicket Down In Kcr Team Yadadri Temple Eo Resigns

 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలనలో అధికారుల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. కొందరు ట్రాన్స్‌ఫర్ల మీద వెళ్తుంటే కొందరు మాత్రం ఏకంగా రాజీనామా చేస్తున్నారు. చేస్తున్నారు అనడం కంటే.. సీఎం రేవంత్‌ రెడ్డి వాళ్లను పీకి పడేస్తున్నారు అనడం కరెక్ట్‌గా ఉంటుంది. గత ప్రభుత్వంలో అధికారాన్ని మించి కేసీఆర్‌ కోసం పనిచేసిన అందరు అధికారులు వరుసగా పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో.. గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఈ మెయిల్‌ ద్వారా దేవాదయశాఖ కమిషనర్‌కు పంపించారు.

2014లో గీతారెడ్డి యాదాద్రి ఆయల ఈవోగా బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పటికే రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు గీతారెడ్డి. రెవెన్యూ శాఖలో ఆర్డీవో హోదాలో ఉంటూనే.. యాదాద్రి ఆయలంలో ఈవోగా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. నిజానికి 2019లోనే గీతారెడ్డి రిటైర్‌ కావాల్సి ఉంది. అప్పటికే ఆమె పదవీకాలం పూర్తయ్యింది. కానీ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మరో సంవత్సర కాలంపాటు గీతారెడ్డిని ఈవోగా కంటిన్యూ చేయాలంటూ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకూ గీతారెడ్డి మాత్రమే ఈవోగా కొనసాగుతారంటూ ఆదేశాలు జారీ చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

దీంతో అప్పటి నుంచి యాదాద్రి ఈవోగానే కొనసాగుతున్నారు గీతారెడ్డి. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితురాలుగా ఉన్న గీతారెడ్డికి పేరుంది. తన కూతురితో సమానంగా గీతారెడ్డిని కేసీఆర్‌ చూసుకుంటారు అని చాలా మంది అంటుంటారు. ఈ చనువు కారణంగానే.. రిటైర్‌ అయ్యాక కూడా గీతారెడ్డి పదవిలో కొనసాగారనే అపవాదు కూడా ఉంది. బహుశా ఇదే కారణం అనుకుంటా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గీతారెడ్డి జాబ్‌ కూడా పోయింది. వెంటనే గీతారెడ్డి రాజీనామా యచేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తన రాజీనామాను కమిషనర్‌కు పంపారు గీతారెడ్డి.