32 Teeth Baby : బోసి నవ్వులు లేవు.. పుట్టుకతోనే పాపకు 32 పళ్లు..
అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు. చిన్ని చిన్ని కళ్లు, చిన్ని ముక్కు, బోసి నవ్వులతో చాలా క్యూట్‌గా ఉంటారు కదా. 99 శాతం పిల్లలంతా ఇలాగే పుడతారు.

Anthya Acharya incident in the medical and health department.. 32 teeth since the birth of the baby..
అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు. చిన్ని చిన్ని కళ్లు, చిన్ని ముక్కు, బోసి నవ్వులతో చాలా క్యూట్‌గా ఉంటారు కదా. 99 శాతం పిల్లలంతా ఇలాగే పుడతారు. కానీ ఈ శిశువు మాత్రం ప్రపంచంలో అందరికంటే డిఫరెంట్. ఎందుకంటే ఈ బేబీ పుట్టడమే ఏకంగా 32 పళ్లతో పుట్టింది. ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఈ విచిత్రాన్ని చూసి షాకైపోతోంది. నికా దివా అనే మహిళకు జన్మించిన ఈ బేబీ ఇప్పుడు నెటిజన్ల అటెన్షన్‌ను గ్రాబ్ చేయడమే కాకుండా అంతులేని ఎన్నో ప్రశ్నలను సొసైటీ మీద విసిరేసింది. నికా దివా హాస్పిటల్‌లో డెలివెరీ ఐన వెంటనే పుట్టిన బేబీని చూసి డాక్టర్లు కూడా షాకయ్యారు. 32 పళ్లతో బేబీ కనిపించడంతో ఎవరీకీ ఏమీ అర్థం కాలేదు. కానీ ఇది నాటల్ టీత్ అనే సమస్య కారణంగా జరిగిందని కొందరు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
దీనివళ్ల శిశువు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. పాలిచ్చే తల్లికి మాత్రం ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. దాంతో పాటే ఈ పళ్లు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు కాబట్టి పిల్లలకు అవి గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా పళ్లతో పుట్టడం ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం వివరించలేదు. ఈ బేబీ వీడియోను పాప తల్లి నికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన బేబీకి 32 పళ్లు ఉన్నాయని.. ఇలా వస్తే ఏం ప్రమాదమా అనే విషయంపై అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
ప్రస్తుతం తన బేబీ ఆరోగ్యంగానే ఉందని.. ఇలా పళ్లతో జన్మించడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ బేబీ ఫొటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లపై నెటిజన్లు వింత వింత కామెంట్లు చేస్తున్నారు. ఎలాగు పళ్లు వచ్చాయి కాబట్టి ఫుడ్ పెట్టేయండి అని కొందరు అంటుంటే.. ఈ పళ్లతో పాటు పెరుగుతుంటే మరో 32 పళ్లు వస్తాయా అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా పుట్టుకతోనే 32 పళ్లతో పుట్టి.. ఇంటర్నెట్‌లో ఓ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
View this post on Instagram