Kumari aunty election campaign : గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం

కుమారి ఆంటీ తాజాగా హైదరాబాద్ ను వదిలి.. ఏపీలో గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. ఎందుకంటారా.. ఎన్నికలకోసం.. అవును మీరు విన్నది కరెక్టే.. కానీ ఎన్నికల్లో పోటి మాత్రం చేయడం లేదు..కాకుంటే ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో కుమారి ఆంటీ పాల్గొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 10, 2024 | 01:15 PMLast Updated on: May 10, 2024 | 1:19 PM

Anti Kumari Election Campaign In Gudivada

కుమారి ఆంటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు అంటూ ఉండరేమో.. అతి తక్కువ సమయంలో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్షేషన్ అయిన వ్యక్తి.. సెలబ్రిటీ లెవల్ ఫేమస్ అయిన ఒక సాధారణ మహిళ.. ప్రస్తుతం సమాజంలో ఎవరు ఎందుకు ఫెమస్ అవుతారో.. ఎప్పుడు ఫెమస్ అవుతారో ఎవరికి తెలియాదు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఆకర్షించింది. ఒక్క సారి ఫేమస్ అయితే వారి రేజ్ మాత్రం ఎక్కడికో వెళ్లిపోతుంది. అలాంటి వారిలో అది మహిళల్లో కుమారి అంటీ అగ్రస్థానమే అని చెప్పాలి..

ఇక విషయం లోకి వెళితే..

కుమారి ఆంటీ తాజాగా హైదరాబాద్ ను వదిలి.. ఏపీలో గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. ఎందుకంటారా.. ఎన్నికలకోసం.. అవును మీరు విన్నది కరెక్టే.. కానీ ఎన్నికల్లో పోటి మాత్రం చేయడం లేదు..కాకుంటే ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో కుమారి ఆంటీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు. మహర్షి సినిమాలో మహేశ్ బాబు లాంటి మంచి వ్యక్తి రాము అంటూ ప్రశంసించారు. ఉపాధి లేక తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, తన సొంత ఊరు పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చానని 15ఏళ్లుగా గుడివాడలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అధికా పార్టీని దుయ్యబడ్డారు. నా సొంత ఊరు ఉన్న గుడివాడ అభివృద్ధి జరగాలి.. గుడివాడపై ప్రేమతో.. ఇక్కడి టీడీపీ పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రామురే మద్దతు తెలుపుతున్నాని వెల్లడించారు.

గతంలో గుడివాడ మంత్రిగా ఉన్న కొడాలి నాని హయంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. పైగా కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించలేదని.. ఉన్న ఉపాధఇ అవకాశాలు తగ్గిపోయాని.. వ్యాఖ్యానించారు కుమారి ఆంటీ.

SSM