Avinash, Anuja, Miss Carrie : బిడ్డను కోల్పోయిన ముక్కు అవినాష్‌

జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమేడియన్స్‌లో ముక్కు అవినాష్‌ కూడా ఒకరు. చక్కటి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో.. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ముందుకు వెళ్తునే 2021లో ఓ ఇంటివాడు అయ్యాడు అవినాష్‌. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2024 | 05:50 PMLast Updated on: Jan 07, 2024 | 5:50 PM

Anuja The Wife Of The Famous Jabardhast Comedian Has A Miss Carry

జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమేడియన్స్‌లో ముక్కు అవినాష్‌ కూడా ఒకరు. చక్కటి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో.. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ముందుకు వెళ్తునే 2021లో ఓ ఇంటివాడు అయ్యాడు అవినాష్‌. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. తరుచుగా తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినట్టు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

రీసెంట్‌గా అనూజకు అట్టహాసంగా సీమంతం వేడుక కూడా నిర్వహించాడు. త్వరలోనే తమ ఇంటికి ఓ బుల్లి బేబీ రాబోతోందని సంబరపడిపోయాడు. కానీ వాళ్లిద్దరి సంతోషం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అనూజ మిస్‌ క్యారీ అవడం వల్ల తన బిడ్డను కోల్పోయాడు అవినాష్‌. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన బాధను అభిమానులతో పంచుకున్నాడు. బాధను దిగమింగలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని కారణాలతో బిడ్డను కోల్పోయామని, అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని పోస్ట్‌ చేశాడు. “నా జీవితంలో సంతోషమైనా, బాధ అయినా, నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతీ ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ, మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.

మేము అమ్మ నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూశాం. కానీ, కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాన్నీ పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్” అంటూ పోస్ట్‌ పెట్టాడు. అవినాష్‌ పెట్టిన పోస్ట్‌ చూసి అంతా షాకయ్యారు. త్వరలో బిడ్డను చూపిస్తాడు అనుకుంటే ఇలా జరిగేంది అంటూ బాధపడుతున్నారు. ధైర్యంగా ఉండండీ అంటూ అవినాష్‌ అనూజలకు ధైర్యం చెప్తున్నారు.