Anupam Kher And Deepika: తెలుగోల్లు తింగరోల్లు..
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా హిందీ మూవీలో తను నటిస్తే 10 రోజులకు 50 లక్షలు.. అంటే రోజుకి 5 లక్షల పారితోషికం తీసుకుంటాడట.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా హిందీ మూవీలో తను నటిస్తే 10 రోజులకు 50 లక్షలు.. అంటే రోజుకి 5 లక్షల పారితోషికం తీసుకుంటాడట. కాని తెలుగు సినిమా వరకొచ్చేసరికి టైగర్ నాగేశ్వరరావుకి కోటిన్నర తీసుకున్నాడట. అది కూడా 10 రోజుల షూటింగ్ కే.. అంటే రోజుకి 15 లక్షలు తీసుకున్నట్టే. తనే కాదు హిందీ సినిమా ఫీల్డ్ లో అడ్రస్ లేని ఇమ్రాన్ హష్మీ తెలుగు మూవీ ఓజీకి ఏకంగా 5 కోట్లు తీసుకుంటున్నాడు.
బాలీవుడ లో లక్షల్లో తీసుకునే నటులు తెలుగు సినిమా అనేసరికి కో అంటే కోట్లు పలుకుతున్నారు. ఇక్కడి నిర్మాతలు పాన్ ఇండియా మోజులో, నార్త్ ఆర్టిస్ట్ లను తీసుకోవాలని, లక్ష ప్లేస్ లోకోటి కర్చు చేస్తున్నారు.. ఇదే ఇప్పుడు తెలుగు నిర్మాతలంటే తింగరోళ్లనే కామెంట్లకు కారణమౌతోంది.
జమానాలో ఓ జోక్ కథలు కథలుగా చెప్పేవాళ్లు.. ఏంటంటే యూరోప్ లో చెప్పులు తుడిచే తెల్ల అమ్మాయి కూడా భారత్ మహారాజాను పెళ్లి చేసుకుని రాణిగా మారాలని కలలు కనేదట.. మనోళ్లకి తెల్లోల్లయితే చాలు కాబట్టి, ఈజీగా వాళ్లకు ఇక్కడి మహారాజులు పడిపోతారనే ఓ అభిప్రాయం జోకులా పేలేది.. అచ్చంగా బాలీవుడ్ నటుల్ని, అక్కడి మోడల్స్ ని కేవలం గ్లామర్ షోకో, లేదంటే నార్త్ ఇండియా మార్కెట్ కోసమే తీసుకుంటున్నారు. అదే అదునుగా, అక్కడ రోజుకి లక్ష తీసుకునే ఔట్ డేటెట్ నటులు కూడా కోట్లల్లో ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు.. ఇచ్చేవాళ్లు ఇస్తుంటే, తీసుకునే వాళ్లకేం తీసేసుకుంటారు.. కాని పాన్ ఇండియా మోజులో వేలం వెర్రిగా కొందరు నిర్మాతలు చేసే తప్పుతు, టాలీవుడ్ అంటే తింగరి రిచ్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ అనుకునే పరిస్థితి వచ్చింది.