Anushka: పెద్ద హీరోయిన్ కి కుర్ర హీరోకి కెమిస్ట్రీ కుదురుతుందా.?
నవీన్ పోలిశెట్టి, అనుష్క కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ సినిమాపై చిరంజీవి స్పందించారు.

Anushka and Naveen's movie Miss Shetty and Mr. Polishetty is buzzing in the halls
అనుష్క, నవీన్ పోలిశెట్టి జత కట్టారన్న వార్తే కొత్తగా వుంది. సీనియర్ స్టార్ బొమ్మాళీ ఎక్కడ? కుర్ర హీరో నవీన్ ఎక్కడ? వీళిద్దరికీ సెట్ అయ్యే కథ ఏమై వుంటుంది? ట్రైలర్‌లోనేమో.. అనుష్క పెళ్లి వద్దు.. పిల్లలు కావాలంటోంది. దర్శకుడు మహేశ్ రాసుకన్న ఆ డిఫరెంట్ కథ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనుష్క ఐదేళ్ల తర్వాత మిస్ శెట్టి రోల్ తో థియేటర్స్‌లోకి వస్తోంది. మధ్యలో నిశ్శబ్దం ఓటీటీలో రిలీజైనా.. భాగమతి తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న సినిమా ఇదే. సైజ్ జీరో కోసం వెయిట్ పెరిగి.. ఆ తర్వాత తగ్గలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్‌లోనూ బొద్దుగానే కనిపించిన బొమ్మాళీకి ఈ సినిమా హిట్ చాలా అవసరం కూడా.
నవీన్ పోలిశెట్టి కనిపించి కూడా రెండున్నరేళ్ళు అయింది. జాతిరత్నాలు తర్వాత గ్యాప్ తీసుకుని నటించిన ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నాడు. అనుష్క ప్రమోషన్స్‌కు రాకపోయినా.. తెలుగు రాష్ట్రాలు తిరిగేసి.. ప్రీమియర్ షో కోసం అమెరికా వెళ్లాడు నవీన్. తనదైన టాలెంట్‌తో సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. సినిమాను చూసిన చిరంజీవి రివ్వ్యూ కూడా ఇచ్చేసి సినిమాను ప్రమోట్ చేశాడు. పుల్ లెంగ్త్ ఎంటర్ టైన్‌మెంట్‌తో ఎమోషన్స్ బాగా పండాయని మెచ్చుకున్నారు మెగాస్టార్. మెగాస్టార్ రివ్వ్యూ సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడనుంది.