Anushka: ప్రభాస్‌కు వంటలు నేర్పిస్తున్న అనుష్క

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా సరికొత్త టాస్క్ లు విసురుతోంది నటి అనుష్క.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 12:11 PMLast Updated on: Sep 06, 2023 | 12:11 PM

Anushka Prepared Her Favorite Food And Threw A Challenge To Hero Prabhas

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క కాంబినేషన్‌లో వస్తున్న మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ఈ నెల 7న ప్రేక్షుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ డిఫరెంట్‌ చాలెంజ్‌ను ప్రారంభించారు మేకర్స్‌. ఈ సినిమాలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపించబోతోంది. దీంతో ఫేవరెట్‌ వంటకం తయారు చేసే చాలెంజ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా అనుష్క మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు నీర్ దోసె రెసిపీలను తయారు చేసింది. అనంతరం ఈ చాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్రభాస్‌ను నామినేట్ చేసింది. ప్రభాస్‌ తన ఫేవరెట్‌ రెసిపీని ఫ్యాన్స్‌తో పంచుకోవాలంటూ కోరింది.

కేవలం ప్రభాస్‌ మాత్రమే కాదు.. ఫ్యాన్స్‌ అంతా తమ ఫేవరెట్‌ రెసిపీని ఈ రెసిపీ చాలెంజ్‌ ద్వారా పంచుకోవాలంటూ ట్వీట్‌ చేసింది. డార్లింగ్‌ ప్రభాస్‌ భోజన ప్రియుడు అన్న విషయం ఆయన ఫ్యాన్స్‌ అందరికీ తెలుసు. అలాంటి డార్లింగ్‌ ఈ చాలెంజ్‌ తీసుకోవాలి అంటే ఎన్ని వంటకాల పేర్లు చెప్పాలో అంటున్నారు ఫ్యాన్స్‌. అనుష్క విసిరిన ఈ చాలెంజ్‌ను ప్రభాస్‌ తీసుకుంటారా లేదా అంటున్నారు. అనుష్క, ప్రభాస్‌ ముందు నుంచి చాలా మంది ఫ్రెండ్స్‌.. సో ఖచ్చితంగా ప్రభాస్‌ ఈ చాలెంజ్‌ తీసుకుంటాడు అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మరి డార్లింగ్‌ ఏం చేస్తాడో చూడాలి.