AP-TG ELECTIONS: ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్లు.. మరింతగా పెరగనున్న పొలిటికల్ హీట్!

ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. నామినేషన్లు ప్రారంభం కానుండటంతో అన్నిస్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. నామినేషన్లు పూర్తైతే ప్రచారం మరింత హోరెత్తుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 02:49 PMLast Updated on: Apr 16, 2024 | 2:49 PM

Ap And Telangana Elections Nomination Process Starts From 18th April

AP-TG ELECTIONS: ఏపీ, తెలంగాణలో ఎన్నికలకు సంబంధించిన కీలక పర్వం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 18, గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల అంకం కీలక ఘట్టానికి చేరుకుంటుంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. నామినేషన్లు ప్రారంభం కానుండటంతో అన్నిస్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది.

JANASENA GLASS: జనసేనకే గాజు గ్లాసు.. హైకోర్టులో బిగ్ రిలీఫ్

నామినేషన్లు పూర్తైతే ప్రచారం మరింత హోరెత్తుతుంది. ప్రస్తుతం లోక్‌సభతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌కు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణకు ఎన్నికలు నాలుగో దశలో, మే 13న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ.
ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ.
ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన.
ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.
మే 13 – పోలింగ్.
జూన్ 4 – ఎన్నికల ఫలితాలు