AP Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం
ఇవాళ ఉదయం 9.46 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటగా సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు.

AP Assembly Meetings.. CM, Deputy CM, Former CM who took oath
ఇవాళ ఉదయం 9.46 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటగా సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు. తొలిత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన ఆయన సగౌరవంగా గౌరవ సభలోకి అడుగుపెట్టారు. కాగా దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సభలోకి అడుగుపెట్టారు.
ఇక ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. మొదటగా సభానాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేశారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేశారు.