Chandrababu Naidu: చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్.. అమరావతి స్కాంలో చార్జిషీటు దాఖలు
ఈ స్కామ్‌లో చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా పేర్కొంది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధరించింది.
Chandrababu Naidu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ షాకిచ్చింది. అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం రూ.4400 కోట్ల విలువైన, 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని సీఐడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ స్కామ్‌లో చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా పేర్కొంది.
Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్!
అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధరించింది. అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవాలనే ఉద్దేశంతోనే అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర మంత్రులు, వారి బినామీలతో కలిసి కుట్ర చేశారని సీఐడీ అభియోగించింది. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా, అసైన్డ్ భూయజమానులను భయపెట్టి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపించింది. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి, మందడం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోని అసైన్డ్ భూములకు కాజేసేందుకే జీఓలు జారీ చేశారని వివరించింది. ఈ కేసులో మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్‌ను కూడా ముద్దాయిలుగా పేర్కొంది.
నారాయణ తన బినామీల పేర్లతో దాదాపు 162 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ అభియోగించింది. తమ ప్లాన్ ప్రకారం అప్పటి మంత్రులకు బినామీలుగా వ్యవహరించిన కొందరు.. అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని ఆరోపించింది. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడుపై చార్జిషీటు దాఖలు చేయడం టీడీపీ, వైసీపీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.