NARA LOKESH: లోకేష్‌కు షాకిచ్చిన ఏపీ సీఐడీ.. అరెస్ట్‌ చేయాలంటూ పిటిషన్‌..

లోకేష్‌ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రీసెంట్‌గా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం సభలో లోకేష్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పిటిషన్‌ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 06:29 PMLast Updated on: Dec 22, 2023 | 6:29 PM

Ap Cid Filed Petetion In Acb Court To Arrest Nara Lokesh

NARA LOKESH: టీడీపీ నేత నారా లోకేష్‌కు పెద్ద షాక్‌ తగిలింది. లోకేష్‌ను అరెస్ట్‌ చేయాలంటూ ఏపీ సీఐడీ.. ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. లోకేష్‌ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రీసెంట్‌గా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం సభలో లోకేష్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పిటిషన్‌ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. పోలిపల్లిలో యువగళం పేరుతో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు.

NARA LOKESH: మా నాన్నే సీఎం.. తెగేసి చెప్పిన లోకేష్.. షాక్‌లో జనసేన.. ఆగ్రహంతో కాపులు

ఈ సభకు టీడీపీ నుంచి, జనసేన నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. ఇదే సభలో నారా లోకేష్ అధికారులను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబును అరెస్ట్‌ చేసిన విధానం. జైలుకు తరలించిన విధానం. ఆయనను విచారించిన విధానాన్ని తన జీవితంలో మర్చిపోలేనంటూ చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన జైలులో ఆయననే విచారించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌లో భాగస్వామ్యం పంచుకున్న ప్రతీ ఒక్క అధికారి పేరు రెడ్‌ డైరీలో రాసుకున్నానంటూ డైరీ చూపిచారు లోకేష్‌. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి చెప్తానంటూ ఓపెన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే పాయింట్‌ను బేస్‌ చేసుకుని లోకేష్‌ మీద ఫిర్యాదు చేసింది ఏపీ సీఐడీ.

అధికారులు తమ విధులు మాత్రమే నిర్వహించారని.. కానీ వాళ్లందరినీ లోకేష్‌ బెదిరిస్తున్నాడంటూ పిటిషన్‌లో పేర్కొంది. వెంటనే లోకేష్‌ను అదుపులోకి తీసుకునేలా కోర్టు పోలీసులను ఆదేశించాలంటూ కోరింది. లోకేష్‌ బయటే ఉంటే.. ఆ అధికారులపై ప్రతీకారం తీర్చుకునే చర్యలకు పాల్పడే అవకాశముంది అనేది సీఐడీ పాయింట్‌. ఈ పిటిషన్‌పై కోర్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుంది అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.