AP CM JAGAN SARKAR: జగనన్నా ! నీ రాజ్యం ఎలా తగలబడిందో చూడు !!

అవినీతిలేని రాజ్యం తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటల్లో ఎంత నిజముందో ఈ సంఘటన తెలియచేస్తోంది.  టేకు చెట్లను లంచంగా ఇవ్వలేదని భూ రికార్డులు తారుమారు చేశారు చిత్తూరు జిల్లాకి చెందిన రెవెన్యూ అధికారులు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 01:25 PMLast Updated on: Dec 11, 2023 | 1:26 PM

Ap Cm Jagan Sarkar Teak Trees Corruption

అవినీతిలేని రాజ్యం తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటల్లో ఎంత నిజముందో ఈ సంఘటన తెలియచేస్తోంది.  టేకు చెట్లను లంచంగా ఇవ్వలేదని భూ రికార్డులు తారుమారు చేశారు చిత్తూరు జిల్లాకి చెందిన రెవెన్యూ అధికారులు. దాంతో జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమంలో కంప్లయింట్ చేసింది బాధితులు రమణమ్మ. రెవెన్యూ సిబ్బంది లంచం అడుగుతున్నారని ప్లకార్డుతో అధికారుల ముందు నిరసన తెలిపింది. ఎస్ కోట మండలం ధర్మవరం సారిపల్లిలో భూమి తాత నుంచి ఆస్తి వారసత్వంగా ఇద్దరు కొడుకులకు చెందాలి. కానీ మొదట  అధికారులను మేనేజ్ చేయడంతో… ఆ భూమి ఒక్కరిదేనని పాస్ బుక్ ఇచ్చేశారు రెవెన్యూ సిబ్బంది. ఫిర్యాదు చేయడంతో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఇద్దరు అన్నదమ్ములవని గుర్తించారు అధికారులు. అప్పుడు రమణమ్మ పేరుతో కొత్త పాస్ బుక్ ను రెవెన్యూ సిబ్బంది మంజూరు చేశారు. కానీ వీఆర్వో అప్పల రామ్ మాత్రం రమణమ్మ టేకు చెట్లు లంచం అడిగాడు. తాను ఇవ్వనని చెప్పడంతో మళ్లీ ఒకరి పేరుతోనే 1బిని మార్చేశారు రెవెన్యూ సిబ్బంది. ఆర్ఐ ఇబ్రహీం, వీఆర్వో అప్పలరామ్ ఇద్దరూ ఎమ్మార్వో ను మేనేజ్ చేశారని రమణమ్మ ఆరోపించింది. తన భూమి తమకు కాకుండా రెవన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.