Tirupati CM Jagan : రేపు తిరుపతిలో ఏపీ సీఎం జగన్ పర్యటన..
రేపు తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తున్న మోదీ.. షేడ్యూల్ ప్రకారం రేపు ఆదివారం ప్రదాని మోదీ తిరుపతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానితో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు.

AP CM Jagan's visit to Tirupati tomorrow..
రేపు తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తున్న మోదీ.. షేడ్యూల్ ప్రకారం రేపు ఆదివారం ప్రదాని మోదీ తిరుపతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానితో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజల పర్యటన కోసం ప్రధాని మోదీ తిరుపతి వెళ్తున్నారు. ప్రధాని మోదీ 26వ తేదీ సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి.. రాత్రి అక్కడే బస చేస్తారు. 27వ తేదీ ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు ప్రధాని మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుమల కొండపైకి ఘాట్ రోడ్డు మార్గం వెంబడి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రోజు తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే సమయంలో.. వీవీఐపీ పర్యటన నిబంధనల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎస్ సూచించారు.