AP DSC 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, షెడ్యూల్ ఇదే..!

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న 6,100 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. మొత్తం ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299, ఎస్టీజీ పోస్టులు 2280, పీజీటీ పోస్టులు 215, టీజీటీ పోస్టులు 1264, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 04:05 PMLast Updated on: Feb 07, 2024 | 4:05 PM

Ap Dsc 2024 Notification Released By Botsa Satyanarayana

AP DSC 2024: ఏపీలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలచేశారు. వేగవంతంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు బొత్స తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న 6,100 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. మొత్తం ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299, ఎస్టీజీ పోస్టులు 2280, పీజీటీ పోస్టులు 215, టీజీటీ పోస్టులు 1264, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి.

YS SHARMILA: దమ్ముంటే మోదీని ఇది అడుగు.. జగన్‌కు షర్మిల సవాల్‌..

ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. దీని ద్వారా అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానాన్ని గతంలో 12 ఏళ్ల క్రితమే తొలగించారు. అంటే.. ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు అప్రెంటిస్‌షిప్‌ విధానంలో పని చేయాలి. ఈ సమయంలో గౌరవ వేతనమే అందుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి వేతనం వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి అప్రెంటిస్‌షిప్‌ కాలాన్ని పొడిగిస్తారు. అయితే, ఈ నోటిఫికేషన్‌పై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి, వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లు కాలయాపన చేసిందని విమర్శిస్తున్నారు.

పైగా ఇప్పుడు మెగా డీఎస్సీ కాకుండా.. కొన్ని ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యేలా మినీ డీఎస్సీ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హేతుబద్దీకరణ పేరుతో 2000 స్కూళ్లను మూసివేసారని, 15 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని వారు మండిపడుతున్నారు. ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, అందువల్ల 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.