AP DSC: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా..
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే పరీక్షను వాయిదా వేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని విద్యాశాఖ తెలిపింది.
AP DSC: ఎన్నికల సమయంలో డీఎస్సీ నిర్వహణపై ఉన్న అనుమానాలకు ఈసీ తెరదించింది. ఎన్నికలు ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. అలాగే.. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాల విడుదలను కూడా వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు.
AP Volunteers: వాలంటీర్లపై కూసిన కోడ్.. పింఛన్లు పంపిణీ చేయొద్దన్న ఈసీ
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే పరీక్షను వాయిదా వేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని విద్యాశాఖ తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పరీక్ష విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విద్యాశాఖ నిర్ణయానికి అనుగుణంగా ఈసీ కూడా పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. ఏపీలో ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు పేపర్-1 పరీక్షలు, మార్చి 6 వరకు ఏపీ టెట్ 2024 పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 14న టెట్ ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఎన్నికలు, ఫలితాల అనంతరమే టెట్ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత డీఎస్సీ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీల్ని ప్రకటిస్తారు. ఇప్పటికే వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల ఎంపిక ఆప్షన్లు కూడా ఈసీ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులోకి వస్తాయని ఏపీ విద్యాశాఖ పేర్కొంది.