AP LIQUOR SHOCK: మందుబాబులకు షాక్.. మూతపడుతున్న మద్యం షాపులు.. కారణమిదే..
ఈసారి ఎన్నికలకు మద్యం అమ్మకాలపై పరిమితులు పెట్టింది ఎలక్షన్ కమిషన్. దాంతో మద్యం దొరక్క.. మందు బాబులు లబోదిబోమంటున్నారు. ఏపీలో మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూతపడతాయో తెలియని పరిస్థితి ఉంది.
AP LIQUOR SHOCK: ఎన్నికలు అంటే చాలు.. మద్యం, ముక్కకు ఫుల్లు గిరాకీ ఉంటుంది. తమ వెంట వచ్చే కార్యకర్తలు, జనంతో పాటు ఓటర్లకి పంచడానికి ఫుల్లుగా మద్యం కొనుగోలు చేస్తాయి అన్ని రాజకీయ పార్టీలు. కానీ ఈసారి ఎన్నికలకు మద్యం అమ్మకాలపై పరిమితులు పెట్టింది ఎలక్షన్ కమిషన్. దాంతో మద్యం దొరక్క.. మందు బాబులు లబోదిబోమంటున్నారు. ఏపీలో మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూతపడతాయో తెలియని పరిస్థితి ఉంది. చాలా పట్టణాల్లో నో స్టాక్ బోర్డులు పెడుతూ లిక్కర్ షాపులను మూసేస్తున్నారు ఓనర్లు.
Kadiyam Srihari Vs Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా రాజయ్య.. కడియం మీద ప్రతీకారం తీర్చుకుంటారా..?
ఎన్నికల కోడ్‌తో మద్యం అమ్మకాలపై ఈసీ నిఘా పెట్టింది. ఇక నుంచి పరిమితంగానే మద్యాన్ని అమ్ముతారు. ఎన్నికల్లో మందు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈసీ. గత ఏడాది ఇదే టైమ్‌కి ఎంత లిక్కర్ సేల్ చేశారో.. ఈసారి కూడా ఆ షాపు అంతే అమ్మాలి. అంతకు మించి సేల్ చేయడానికి కుదరదు అని జిల్లా కలెక్టర్లు షాపులకు ఆదేశాలిచ్చారు. దాంతో లిక్కర్ షాపుల యజమానులు గత ఏడాది స్టాక్ లెక్కలు చూసుకొని, అంతవరకే తెచ్చి అమ్ముకొని షాపులు మూసేస్తున్నారు. ఈ సంగతి తెలియక.. చాలా మంది మందుబాబులు షాపుల ఓనర్లతో గొడవకు దిగుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దాంతో బీర్లకు మస్తు డిమాండ్ ఉంటుంది. కానీ షాపుల యజమానులు ఎన్నంటే అన్ని బీర్లు కొనుక్కునే పరిస్థితి లేదు. మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సప్లయ్ అయ్యే మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు.
మద్యం నిల్వలను ఎత్తివేయడంతో పాటు.. అమ్మకాలపై ప్రతి రోజూ జిల్లా ఎన్నికల అధికారులకు నివేదికలు పంపుతున్నారు. 2023 ఏప్రిల్ నెలలో షాపుల్లో ఎంత అమ్మకాలు జరిగాయో.. ఇప్పుడు కూడా అంతే అమ్మాలి. దాంతో చాలా షాపులు తొందరగా మూతపడుతున్నాయి. ఈసీ ఆదేశాలు తెలీక షాపుల ముందు క్యూ కడుతున్న మందు బాబులు మద్యం దొరక్కపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. సోషల్ యాక్టివిస్టులు మాత్రం ఈసీ చర్యలను సమర్థిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యం పంపిణీ చేయకుండా సరైన నిర్ణయం తీసుకుందని మెచ్చుకుంటున్నారు.