AP Common Capital out : జూన్ 2 తర్వాత హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం అద్దెలు కట్టాల్సిందే !

2024 జూన్ 2 తర్వాత హైదరాబాద్ (GHMC) ఇక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉండదు. పదేళ్ళ కాల పరిమితి పూర్తవుతోంది. అందువల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ సర్కార్ కి వెళ్ళిపోతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2024 | 12:51 PMLast Updated on: Mar 27, 2024 | 12:51 PM

Ap Government Has To Pay Rent In Hyderabad After June 2

2024 జూన్ 2 తర్వాత హైదరాబాద్ (GHMC) ఇక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉండదు. పదేళ్ళ కాల పరిమితి పూర్తవుతోంది. అందువల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ సర్కార్ కి వెళ్ళిపోతాయి. జూన్ 2 తర్వాత ఏ బిల్డింగ్ వాడుకున్నా ఏపీ గవర్నమెంట్ TS సర్కార్ కి అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పునర్వ్యవస్థీకరణ 2014 బిల్లు ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మున్సిపాలిటీ పదేళ్ళ పాటు తెలంగాణ (Telangana), ఏపీలకు రాజధానిగా ఉంటుంది. ఆ కాలపరిమితి 2024 జూన్ 2కి ముగుస్తోంది. అప్పటి నుంచి హైదరాబాద్ ఇక తెలంగాణ కేపిటల్ మాత్రమే. ఏపీకి ఏ మాత్రం సంబంధం లేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు (జూన్ 4) రాకముందే హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాలి. లేదంటే అప్పటి నుంచి ఎన్నిరోజులు కొనసాగితే అన్ని రోజులు ప్రభుత్వం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.

2014 నుంచి పదేళ్ళ పాటు 2024 దాకా హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు కామన్ కేపిటల్ అయినా…2016లోనే చాలా ఆఫీసులు అమరావతికి షిప్ట్ అయ్యాయి. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు … అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచే పాలన చేపట్టాలని నిర్ణయించారు. దాంతో సెక్రటరియేట్ లో ఉన్న ఆఫీసులతో పాటు ఏపీకి చెందిన మిగతా శాఖల కార్యాలయాలు కూడా 2017 వరకూ అమరావతి, విజయవాడకు తరలిపోయాయి. అప్పటికీ ఇంకా కొనసాగుతున్న ఏపీ ఆఫీస్ బిల్డింగ్స్ కి ఎలాంటి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కూడా 2019లో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ లో ఏపీ ఆఫీసులు ఉన్నాయా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు బిల్డింగ్ లను తెలంగాణలో వాడుకుంటోంది. అందులో ఒకటి లకడీ కపూల్ లో ఉన్న ఏపీ సీఐడీ బిల్డింగ్. రెండోది ఆదర్శ్ నగర్ లో ఉన్న హెర్మిటేజ్ బిల్డింగ్, మూడోది లేక్ వ్యూ గెస్ట్ హౌస్. ఈ మూడు భవనాలను కూడా జూన్ 2లోగా ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయాలి. మరో ఏడాది దాకా వీటిని వాడుకునేలా తేదీని పొడిగించాలని తెలంగాణ సర్కార్ ను అధికారులు రిక్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రేవంత్ సర్కార్ కూడా కొంతకాలం ఓపిక పట్టే ఛాన్సుంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మాత్రం ఏపీ ప్రభుత్వం జూన్ 2 తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చని అంటున్నారు. ఇక్కడ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు ప్రెస్ మీట్స్ నిర్వహిస్తుంటారు. అందుకే ఢిల్లీలో ఆంధ్ర భవన్ లాగా హైదరాబాద్ లోనూ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో ఈ మూడు బిల్డింగ్స్ ఖాళీ చేయడమా… లేదంటే తెలంగాణ సర్కార్ కి అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకోవడమా అన్నది. జూన్ 4 తర్వాత ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.