AP Pensions: మేలో పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి బ్యాంకు అకౌంట్లలోనే..

ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే, రాబోయే మే నెలలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ నగదును మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2024 | 08:25 PMLast Updated on: Apr 28, 2024 | 8:25 PM

Ap Government Took Key Decision On The Distribution Of Pensions In The State

AP Pensions: ఏపీలో పింఛన్ల అంశం ఎంతటి వివాదాస్పదం అయిందో తెలిసిందే. ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో వివాదం మొదలైంది. వాలంటీర్లు లేకపోవడంతో పింఛన్‌దారులు ఇబ్బందిపడ్డారు. పింఛన్ల కోసం వెళ్లి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని వైసీపీ ఆరోపించింది.

YS JAGAN: చంద్రబాబును నమ్మితే.. చంద్రముఖిని నిద్రలేపినట్లే: వైఎస్ జగన్

ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనంతటికీ కారణం మీరంటే.. మీరంటూ.. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకున్నాయి. అయితే, రాబోయే మే నెలలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ నగదును మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మే 1 నుంచి 5వ తేదీ లోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత అనుభవాల దృష్ట్యా, ఈసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పింఛన్‌దారులున్నారు. వీరిలో 48,92,503 మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. వీరికి బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తారు.

మిగిలిన వారికి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గతంలో వాలంటీర్లే ప్రతి నెలా ఒకటో తేదీని ఇంటివద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేసేవాళ్లు. అయితే, ఎన్నికల కోడ్ దృష్ట్యా వారి విధులపై ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో పింఛన్లు పంపిణీ చేసేందుకు తగిన సిబ్బంది లేక.. ఇబ్బంది ఎదురైంది. ఇది రాజకీయ వివాదంగా మారింది.