AP Inter results : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..పై చేయి సాధించిన అమ్మాయిలు
ఏపీ విద్యార్థులకు శుభ వార్త.. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడే పల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడదల చేశారు.
ఏపీ విద్యార్థులకు శుభ వార్త.. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడే పల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడదల చేశారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన ఏపీ విద్యాశాఖ.. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం జనవరి 4న పూర్తికాగా.. విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేసిన అధికారులు ఏప్రిల్ 12న ఫలితాలను వెల్లడించారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.99 లక్షల మంది పరీక్ష రాయగా.. సెకండ్ ఇయర్లో 78 శాతం, ఫస్ట్ ఇయర్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డు తెలిపింది. ఏపీలో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. సెకండియర్లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 75శాతం మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిలు 71శాతం, అబ్బాయిలు 64శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది.
ఇంటర్ మొదటి సంవత్సరం..
- మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 2,26,240 మంది.
- ఉత్తీర్ణత సాధించిన వారు 1,43,688 మంది.
- ఉత్తీర్ణత శాతం 64%.
- మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలికలు 2,35,033 మంది.
- ఉత్తీర్ణత సాధించిన వారు 1,67,187 మంది.
- ఉత్తీర్ణత శాతం 71%.
- ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి.
ఇంటర్ రెండో సంవత్సరం..
- ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 1,88,849 మంది.
- ఉత్తీర్ణత సాధించిన వారు 1,44,465 మంది
- ఉత్తీర్ణత శాతం 75%.
- ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలికలు 2,04,908 మంది
- ఉత్తీర్ణత సాధించిన వారు 1,65,063 మంది
- ఉత్తీర్ణత శాతం 81%
- ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలదే పైచేయి.
- మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు..
వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.