AP Leaders : లీడర్లు విదేశాల్లో…. ఓటర్లు పోలీస్ స్టేషన్లో.. !!

ఏపీలో ఒక పల్లెటూరి ఇది. పోలింగ్ అయ్యాక కనిపించిన దృశ్యం ఇది. వందల మంది ఆటవికంగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ... కర్రలతో కొట్టుకుంటున్నారు. మగాళ్ళకి ఆడాళ్లు కర్రలు , రాళ్లు అందిస్తున్నారు. ఒకరిని మరొకరు చంపాలంటూ అరుస్తున్నారు. ఈ దృశ్యం ఒక్క గ్రామంలోనిదే కాదు.... తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఈ సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటకు 14 లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్లిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వీడన్ లో సేద తీరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. షర్మిల కూడా అమెరికా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, చిన్నా చితకా నేతలు కూడా యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇంకొందరు బాలి ద్వీపం వెళ్లి అక్కడ రక రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. మరికొందరు స్విట్జర్లాండ్, బ్యాంకాక్ తోపాటు మరికొన్ని విహార ప్రాంతాల్లో సేద తీరుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2024 | 12:16 PMLast Updated on: May 22, 2024 | 12:16 PM

Ap Leaders

ఏపీలో ఒక పల్లెటూరి ఇది. పోలింగ్ అయ్యాక కనిపించిన దృశ్యం ఇది. వందల మంది ఆటవికంగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ… కర్రలతో కొట్టుకుంటున్నారు. మగాళ్ళకి ఆడాళ్లు కర్రలు , రాళ్లు అందిస్తున్నారు. ఒకరిని మరొకరు చంపాలంటూ అరుస్తున్నారు. ఈ దృశ్యం ఒక్క గ్రామంలోనిదే కాదు…. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఈ సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటకు 14 లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్లిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వీడన్ లో సేద తీరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. షర్మిల కూడా అమెరికా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, చిన్నా చితకా నేతలు కూడా
యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇంకొందరు బాలి ద్వీపం వెళ్లి అక్కడ రక రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. మరికొందరు స్విట్జర్లాండ్, బ్యాంకాక్ తోపాటు మరికొన్ని విహార ప్రాంతాల్లో సేద తీరుతున్నారు.

ఇదే సమయంలో పల్నాడు, మాచర్ల, చిత్తూరు, అనంతపురం, కోస్తా జిల్లాలు, విశాఖ ప్రాంతంలో జనం పిచ్చెక్కినట్లు రాళ్లతో మూకుమ్మడి దాడులు చేసుకుంటున్నారు. కర్రలతో తలలు పగల కొట్టుకుంటున్నారు. తమ ప్రియతమ నాయకుల కోసం… పార్టీల కోసం పోలింగ్ అయ్యాక కూడా ఆగని క్రోధంతో… పగా ప్రతీకారాలతో ఒకరి ప్రాణాలను మరొకరు తీసుకోవాలని ఆవేశంతో, ఉద్రేకంతో, ఊగిపోతూ కత్తులు కటార్లు పట్టుకొని తెగబడుతున్నారు. వీళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎవరికోసం ఈ ప్రాణాలు వదులుకుంటున్నారో… ఎవరికోసం ఇంత ఆధునిక యుగంలోనూ ఆటవిక మూకల్లా తలపడుతున్నారో అర్థం కావట్లేదు. తెలుగు సినిమాల్లో చూస్తే మన పల్లెటూర్లన్నీ ప్రశాంతంగా ఉంటాయనీ… జనమంతా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తారనీ…. పచ్చని పొలాలు… పిల్ల కాలువలు… ఆలుమగలతో అలారారుతుంటాయని అనుకుంటాం. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. జనం కులాలు లెక్కన విడిపోయారు. వర్గాలు లెక్కన కొట్టుకుంటున్నారు. పార్టీలు లెక్కన నిత్యం పొడుచుకు చస్తున్నారు. మగాళ్లు కర్రలు, ఐరన్ రాడ్లు తో స్వైర విహారం చేస్తుంటే.. ఆడవాళ్లు వాళ్లకు కావాల్సిన రాళ్లు, రప్పలు సేకరించి ఇస్తున్నారు. ఇది ఇవాళ పల్లెటూర్ల పరిస్థితి. దీన్ని సృష్టించింది ఏపీలో రాజకీయ నాయకులు. వాళ్ళ ఆట అయిపోయింది. ప్రశాంతంగా… విదేశాల్లో శీతల ప్రాంతాల్లో సేదతీరుతున్నారు. కానీ వాళ్ళు అంటించి వెళ్లిన రావణ కాష్టం ఇంకా పల్లెల్లో రగులుతూనే ఉంది. అసలు ఏ
సంబంధం లేకుండానే… వాడు ఆ కులం… వీడు మనం… ఈ కులం వాళ్ళం. వాడు ఆ పార్టీ వాడు… మనం ఈ పార్టీ వాళ్ళం…. ఇలా అనుకుంటూ బృందాలుగా విడిపోతూ అల్లర్లు చేసుకుంటున్నారు. ఆస్తులు తగలబెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగిన హింసలో ఇప్పటికే 1500 మందికి పైగా అరెస్టయ్యారు. అల్లర్లకు పాల్పడిన మరికొన్ని వందల మందిని గుర్తించారు వాళ్లు రేపు మాపో జైల్లోకి వెళ్తారు. వాళ్ల కుటుంబ సభ్యులు అలో లక్షణా అని ఏడుస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ పెట్టే కేసులు కోసం మరో పదేళ్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. బెయిల్ కోసం వేల రూపాయలు అప్పులు చేసి, ఆస్తులు తెగ నమ్మి కట్టి బయటికి రావాలి. ఎవరి కోసం చేశారు ఇదంతా? ఎందుకోసం చేస్తున్నారు ఇదంతా? అధికారంలోకి వచ్చేది ఎవరు? కుర్చీలో కూర్చునేది ఎవరు? సామాన్య జనానికి ఆ అధికార పీఠాలతో ఏ సంబంధం? మరి వీళ్ళు ఎందుకు కొట్టుకు చస్తున్నారు? ఎన్నడైనా ఎప్పుడైనా ఒక్కరోజు ఆలోచించారా? లీడర్ల పిల్లలు అమెరికాలో లండన్ లో చదువుకుంటున్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు. జగన్ కూతుళ్లు ఇద్దరూ లండన్ లో చదువుతున్నారు. షర్మిల పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఖరీదైన స్కూళ్లలో ఉన్నారు. మరి జనం పిల్లలు? పొలాల్లో పశువులు కాస్తున్నారు. వాచ్ మెన్ లు గా పని చేస్తున్నారు. చదువు సంధ్య లేక మోటార్ మెకానిక్స్ గా స్థిరపడుతున్నారు. ఏనాడైనా ఆలోచించారా?
లీడర్ల పిల్లలు ఫారిన్ లో ఎందుకు చదువుతున్నారు….? మన పిల్లలు చదువు సంధ్యలు లేక రోడ్ల మీద తిరుగుతూ, మెకానిక్ షెడ్లలో ఎందుకు స్థిరపడుతున్నారు? మనం ఎప్పుడూ పేదవాళ్లు గానే ఎందుకు ఉండిపోతున్నాం? వాళ్లు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ… రాజకీయం ఎలా చేస్తున్నారు? రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలోనూ పల్లెల్లో కొట్టుకు చచ్చారు. లోకేష్, జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ పల్లెల్లో కొట్టుకు చస్తున్నారు. అంటే వాళ్ల తరాలు మారుతున్నాయి. వాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు అవుతున్నారు. లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. జనం మాత్రం మారట్లేదు. అదే పేదరికంలో ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఎన్నికల్లో పల్లెల్లో తలలు పగలగొట్టుకుంటున్నారు. మూకుమ్మడి దాడులు చేసుకుంటున్నారు.

పోలింగ్ అవ్వగానే లీడర్లంతా ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు పారిపోయారు. వాళ్ల కోసం ఇక్కడ పిచ్చి జనం రక్తాలు వచ్చేలా తలలు పగలగొట్టుకుంటున్నారు. అసలు ఏమైనా అర్థం ఉందా? రేపు చంద్రబాబు, జగను ఎవడో ఒకడు గెలుస్తాడు. వాళ్లు ముఖ్యమంత్రులవుతారు. వాళ్లు చుట్టూ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు.. మంత్రులు అవుతారు. కానీ వాళ్ల కోసం రోడ్లెక్కి బరిసెలతో పొడుచుకున్న వాళ్ళు జైలు పాలవుతారు. లేదా అవతల వాడి కత్తిపోటుకు చస్తారు. కుటుంబాలు అనాధలవుతాయి. కానీ ఇవన్నీ ఆలోచించి శక్తిని పల్లె జనం కోల్పోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చే వెయ్యి రూపాయలకి, కోటర్ బాటిల్ కి అమ్ముడుపోయి… ఎవడినో గెలిపించడానికి వీళ్లు రాళ్లు కర్రలు, కత్తులు పట్టుకుని ఆడా మగా తేడా లేకుండా రోడ్లెక్కుతున్నారు. ప్రపంచం మొత్తం ఆధునిక టెక్నాలజీ వైపు, మౌలిక సదుపాయాలు వైపు, అభివృద్ది వైపు పరిగెడుతుంటే ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో మాత్రం ఆటవిక సంస్కృతి రోజు రోజుకి పెరుగుతోంది. జనం కొట్టుకు చావడానికి ఓ రెడ్డి గారు, ఓ చౌదరి గారు, ఓ నాయుడు గారు, కర్రలు కత్తులు సప్లై చేసి విదేశాలకు వెళ్ళిపోయారు.
ఇక్కడ జనానికి చివరికి మిగిలింది కేసులు… కోర్టులు. ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్, షర్మిల వీళ్లంతా ఏసీ కార్లల్లోనూ, హెలికాఫ్టర్లలోనూ తిరుగుతూ చేస్తున్న హైటెక్ రాజకీయం…. జనం బతుకుని ఎలా ఆగం చేస్తుందో.. చివరికి యుద్ధంలో ఎవరు నష్టపోతున్నారో తెలుసుకోండి. వాడెవడిన్నో సీఎం చేయడానికి, ఇంకెవరినో ఎమ్మెల్యే చేయడానికి… సామాన్య జనం ఎందుకు బలవ్వాలో… ఈ యుద్ధంలో చివరికి ఏం మిగులుతుందో ఆలోచించండి.