Venkatram Reddy: ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికి షాక్.. వెంకటరామిరెడ్డిపై ఈసీ వేటు..
ఈసీ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన తాజా ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి.
Venkatram Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినందుకు అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వం వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన తాజా ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి.
YS JAGAN: జగన్‌ను చంపాలనుకున్నారు! జగన్ కేసు నిందితుడి విచారణలో సంచలనాలు..
ఇటీవల బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై, వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ.. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం రూల్స్‌కు విరుద్ధం. అందుకే వెంకటరామిరెడ్డిపై టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. కడప కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం కడప కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. వెంకటరామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. వెంకటరామిరెడ్డి ప్రస్తుతం పంచాయితీరాజ్ శాఖలో ఇంచార్జి అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.