Union Budget : ఏపీ.. ఊపిరి పీల్చుకో.. రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు.. ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు..
గమ్యం లేని ప్రయాణం.. కాసులు లేని ఖజానా.. రాజధాని లేని రాష్ట్రం.. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో టీడీపీ చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం ముఖచిత్రమ్ మారబోతుందా.. రాజధాని పట్టాలెక్కనుంది.
గమ్యం లేని ప్రయాణం.. కాసులు లేని ఖజానా.. రాజధాని లేని రాష్ట్రం.. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో టీడీపీ చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం ముఖచిత్రమ్ మారబోతుందా.. రాజధాని పట్టాలెక్కనుంది.. అభివృద్ధి దూసుకుపోతుందా అని ఎదురుచూసిన జనాలకు.. నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు గుప్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీపై వరాల జల్లు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. విభజన చట్టానికి అనుగుణంగా నిధుల్ని ప్రకటించారు. ఏపీ రాజధాని అవసరాలను గుర్తించి.. రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు సాయం ప్రకటించారు. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు.
నిర్మలా సీతారామన్, ఆర్ధిక మంత్రి..
ఆంధ్రుల కల పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ.. కేంద్రం వరాలు ప్రకటించింది. వెంటనే నిర్మాణానికి సాయం అందిస్తామని.. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటామని సభ సాక్షిగా నిర్మలమ్మ హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం.. నీళ్లు, రోడ్లు, రైల్వేల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని.. అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు కేటాయిస్తామన్నారు. పూర్వోదయ పథకం ఏపీకి ప్రత్యేక ప్రాజెక్ట్‌లను ప్రకటించారు.
ఇక విశాఖ-చెన్నై, ఓర్వకల్లు- బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అవసరాన్ని బట్టి బహళ సంస్థల ద్వారా ఏపీకి రుణాలిస్తామని క్లియర్‌గా చెప్పారు నిర్మలమ్మ. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని.. వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ, చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి… హైదరాబాద్, బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామన్నారు. బడ్జెట్‌లో నిర్మలమ్మ ప్రకటించిన హామీలతో.. ఏపీ జనాలకు ఆనందబాష్పాలు తీసుకువచ్చాయ్. ఏపీ మీద కేంద్రం ఈ స్థాయిలో వరాలు గుప్పిచిందంటే.. చంద్రబాబు ప్రయత్నం, కష్టం ఎంతో ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రుల్ని కలిశారు.. ఏపీకి సాయం చేయాలని కోరారు. బడ్జెట్‌లో ఏపీకి ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని.. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాలని విన్నపాలు వినిపించారు.