APPSC Group 2 Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
గ్రూప్-2కు ఏపీ వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారు.
APPSC Group 2 Results: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీలో 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది.
Traffic Diversions: రంజాన్ పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
గ్రూప్-2కు ఏపీ వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారు. పరీక్ష ముగిసినప్పటినుంచి అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రిలిమ్స్ ఫలితాల్ని ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. మొత్తం 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు వెల్లడించింది. అలాగే 2557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా అధికారులు విడుదల చేశారు. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు.
ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఫలితాల్ని చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఉంచింది. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా ఇదే.