Ram Charan: రెహమాన్ బిగ్ సర్ ప్రైజ్
రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న లివింగ్ లెజెండ్ ఎ ఆర్ రెహమాన్ ఇప్పుడు ఒక పాటని రెడీ చేశాడు. రామ్ చరణ్ మూవీకోసం సాంగ్ ని కంపోజ్ చేయటమే కాదు, రికార్డింగ్ కూడా పూర్తిచేశాడు. అంతే దెబ్బకి బుచ్చి బాబు, రామ్ చరణ్ ఇద్దరికీ జోష్ వచ్చినట్టైంది.

AR Rahman has prepared and composed the song for Ram Charan's movie
రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న లివింగ్ లెజెండ్ ఎ ఆర్ రెహమాన్ ఇప్పుడు ఒక పాటని రెడీ చేశాడు. రామ్ చరణ్ మూవీకోసం సాంగ్ ని కంపోజ్ చేయటమే కాదు, రికార్డింగ్ కూడా పూర్తిచేశాడు. అంతే దెబ్బకి బుచ్చి బాబు, రామ్ చరణ్ ఇద్దరికీ జోష్ వచ్చినట్టైంది. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు ప్లాన్ చేసుకున్న పీరియాడిక్ మూవీని రామ్ చరణ్ తో ప్లాన్ చేశాడు. 1920వ కాలంలో ఓ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ స్ట్రగులే కథాంశంగా ఈసినిమా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. ఆ మూవీకే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
అయితే మెగా హీరోలకే కాదు తెలుగులో ఏ హీరోకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కలిసిరాలేదనే బ్యాడ్ మార్క్ ఉంది. అప్పట్లో సూపర్ పోలీస్ తో వెంకటేష్, గ్యాంగ్ మాస్టర్ గా రాజశేఖర్, నానితో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ది జెంటిల్మన్ తో చిరు, పులి తో పవన్ కి పంచ్ పడింది. అందుకే ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే బాధ్యత చరణ్ మీద పడింది. ఇక రెహమాన్ మ్యూజిక్ కొడితే పంచ్ పడినట్టే అనే భావనని, సెంటిమెంట్ ని చరణ్ బ్రేక్ చేస్తాడనే అంచనాలు ఒకవైపు, గేమ్ ఛేంజర్ తాలూకు అప్ డేట్స్ లేవని నిరుత్సాహం మరో వైపు.. ఇలాంటి టైంలో రెహమాన్ తో బుచ్చి బాబు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవ్వటం, ఒక పాట రెడీ అవటంతో ఈ అప్ డేట్ మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఉంది. ముఖానికి అయిన గాయం నుంచి రామ్ చరణ్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.