Aliens on America: అమెరికాపై గ్రహాంతరవాసులు దాడి చేయబోతున్నారా…?

అమెరికా గగనతలంపై ఇటీవల వింత వస్తువులు ఎక్కువైపోయాయి. చైనా బెలూన్ సంఘటన మర్చిపోకముందే మరికొన్ని ప్రదేశాల్లో కూాడా ఇలాంటి వస్తువులు దర్శనమిస్తున్నాయి. దీంతో అమెరికాపై గ్రహాంతరవాసులు నిఘా పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2023 | 07:35 PMLast Updated on: Feb 13, 2023 | 7:35 PM

Are Aliens Going To Attack On America

అమెరికాపై దాడికి గ్రహాంతరవాసులు ప్రయత్నిస్తున్నారా…? అమెరికా గగనతలంపై రోజూ ఏలియన్స్ తిరుగుతున్నారా…? ఇప్పుడిదే సెన్సెషనల్ న్యూస్… అమెరికాలో ఆకాశంలో రోజూ కనిపిస్తున్న విచిత్ర వస్తువులు ఫ్లయింగ్ సాసర్స్ అన్న వార్త ఇప్పుడు అమెరికాలో షికార్లు కొడుతోంది. వాళ్లూ వీళ్లూ చెబితే పర్లేదు కానీ ఏకంగా అమెరికా రక్షణశాఖ ఉన్నతాధికారులే ఈ వార్తలను బలపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఇది సెన్సేషన్ అయిపోయింది.

అమెరికా గగనతలంపై రోజూ వింత వస్తువులు కనిపిస్తున్నాయి. చైనా బెలూన్ ఘటన పెద్ద కలకలమే రేపింది. దాన్ని బైడెన్ సర్కార్ కూల్చేసింది. అంతా క్లియర్ అనుకున్న సమయంలో ఇప్పుడూ రోజూ ఆ బెలూన్ తరహా వస్తువులే ప్రత్యక్షమై అమెరికాను టెన్షన్ పెడుతున్నాయి. మొదట అలస్కాలో ఓ వస్తువు కనిపించింది. అన్ని వేల అడుగులో దాన్ని గుర్తించిన నిఘా అధికారులు యుద్ధ విమానం సాయంతో దాన్ని పేల్చేశారు. ఆ తర్వాత కెనడాలో మరొకటి కనిపించింది. వెంటనే కెనడా ప్రధానితో మాట్లాడి దాన్ని కూల్చేశారు. ఈ రెండు వస్తువుల శిధిలాల కోసం వేట మొదలుపెట్టారు. అయితే ఆ వెంటనే కెనడా సరిహద్దుల్లోనే అమెరికా గగనతలంలో మరో వింత వస్తువు ప్రత్యక్షమైంది. దీంతో దాన్ని కూడా నాశనం చేయాల్సి వచ్చింది. దేశ భద్రత దృష్ట్యా వాటిని కూల్చేశామని అమెరికా రక్షణశాఖ అధికారులు ప్రకటించారు.

చైనా బెలూన్్ను కూల్చడానికి మీనమేషాలు లెక్కించిన బైడెన్ సర్కార్ వీటిని మాత్రం గుర్తించిన వెంటనే యాక్షన్్లోకి దిగింది. ఇదే అనుమానాలు రేపుతోంది. సాధారణంగా అంత ఎత్తులో ఎగురుతున్నాయంటే వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించినవి అయి ఉండాలి. అవే అయితే వాటికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద ఉంటుంది. కానీ ఈ వింత వస్తువులకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. పోనీ అవి ఇతర దేశాల నుంచి వస్తున్నాయా అంటే అదీ కాదు. అక్కడిక్కకడే ప్రత్యక్షమైనట్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే కొత్త సందేహాలకు తావిస్తోంది.

ఆ వస్తువులు బెలూన్లు కాదని అమెరికా అధికారులు చెప్పారు. కానీ అవేంటో మాత్రం స్పష్టం చేయలేకపోతున్నారు. దీంతో రోజూ ఇలాంటివి వస్తున్నాయి కదా మరి ఇవేమైనా గ్రహాంతర వాసుల వాహనాలా అని కొందరు అమెరికన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటివేమీ లేవని చెప్పాల్సిన రక్షణశాఖ అధికారులు మాత్రం వారి అనుమానాలను మరింత పెంచేలా, రకరకాల ఊహాగానాలకు ఊతమిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఆ గుర్తు తెలియని వస్తువులు ఇతర గ్రహాల నుంచి వస్తున్నాయన్న సందేహం వచ్చేలా మాట్లాడారు ఎయిర్ ఫోర్స్ జనరల్ గ్లెన్ వాన్ హెర్క్. అమెరికా గగనతల పర్యవేక్షణ బాధ్యత ఆయనదే… అవి బెలూన్లు కాదని మరేదో వస్తువులని ఆయన చెప్పారు. అంతేకాదు అవి ఇతర గ్రహాల నుంచి కూడా వచ్చేవి కూడా కావొచ్చన్నారు.

అమెరికా చాలాకాలంగా గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. రహస్యంగా రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అయితే అవేంటన్నది మాత్ర సీక్రెట్టే… మిస్టీరియస్ ఏరియా51లో ఏం జరుగుతుందన్నది తెలుసుకోవడానికి విదేశీ గూడచారులు కూడా పలు ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ బయటకు రాలేదు. మరిప్పుడు బయటకు వస్తున్న వస్తువులకు దానికి ఏమైనా లింకుందా అన్న కొత్త అనుమానాలు ఇప్పుడు రేగుతున్నాయి. ఏరియా 51నుంచి వెళుతున్న సిగ్నల్స్ నిజంగా గ్రహాంతరవాసులకు చేరుతున్నాయా…? ఆ సంకేతాల ఆధారంగా గ్రహాంతరవాసులు బయటకు వస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. గ్లెన్ వాన్ హెర్క్ మాటలు కూడా వీటిని నిర్ధారిస్తున్నాయని అమెరికన్లు చెబుతున్నారు. గ్రహాంతరవాసులకు సంబంధించి అమెరికా దగ్గర చాలా సమాచారం ఉంది. గతంలో కూడా కొందరు ఏలియన్స్ ను అమెరికా పట్టుకుందని వారిపై రహస్య పరిశోధనలు చేసిందన్న ప్రచారమూ ఉంది. కానీ పెంటగాన్ మాత్రం వాటిని నిర్ధారించలేదు. ఇప్పుడు ఏకంగా అమెరికాలో ఆకాశంలో రోజుకో వస్తువు దర్శనమిస్తుండటంతో ఏలియన్స్ వార్తలు ఊపందుకున్నాయి.

(KK)