CM Jagan: ఎన్నికలకు సిద్ధం అవండి.. జగన్ మాటకు అర్థమేంటి ?
ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు ఏపీ సీఎం జగన్. కేబినెట్ సమావేశంలో కీలక సూచనలు చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత.. అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై మంత్రులతో జగన్ చర్చించారు. మరో 9 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
జగనన్న సురక్ష క్యాంపెయిన్‌ను పర్యవేక్షించాలని.. మంత్రులకు సూచించారు జగన్. గడప గడపకు మన ప్రభుత్వం విషయంలో ఏమాత్రం అలసత్వం చూపించొద్దని అన్నారు. తాము ఇంచార్జులుగా ఉన్న జిల్లాల్లో కూడా మంత్రులు ఫోకస్ చేయాలని.. మంత్రులను ఆదేశించారు. జనాల సమస్యలు ఏమిటీ, వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టిసారించాలని సూచించారు. ఇదంతా ఎలా ఉన్నా.. మీటింగ్ జరిగిన ప్రతీసారి ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఏపీలో ముందస్తు ఖాయం అనే ప్రచారం నడుస్తోంది.
జగన్ నిర్ణయాలు చూసినా.. విపక్షాల జాగ్రత్తలు పరిశీలించినా ఇదే అర్థం అవుతోంది. ఎన్నికలకు ఇప్పటినుంచే జాగ్రత్త పడాలని పదేపదే చెప్తున్నారు అంటే.. నిజంగా ముందస్తు ఉంటుందా.. పైకి చెప్పే మాటల్లో అర్థం వేరే ఉందా అనే డిస్కషన్ నడుస్తసోంది. నిజానికి 2024 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయ్. ఐతే ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. దీంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. జనాల్లోనే ఉండేలా.. జనంలో వినిపించేలా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు జగన్.