DK Aruna VS CM Revanth Reddy : చేసిన తప్పులు వెంటాడుతున్నాయా.. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ పరిస్థితేంటి?
సొంత గడ్డ మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు షాక్ తప్పదా ? ఇప్పటి వరకూ పొలిటికల్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న డీకే అరుణ ఇక పాలమూరు నుంచి పాగా పీకాల్సిందేనా? మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న సీన్ చూస్తే ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది.
సొంత గడ్డ మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు షాక్ తప్పదా ? ఇప్పటి వరకూ పొలిటికల్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న డీకే అరుణ ఇక పాలమూరు నుంచి పాగా పీకాల్సిందేనా? మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న సీన్ చూస్తే ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణలో ఉన్న సీనియర్ లేడీ పొలిటీషియన్స్‌లో డీకే అరుణ కూడా ఫస్ట్ లేన్‌లోనే ఉంటారు. దాదాపు దశాబ్ధ కాలంగా రాజకీయాల్లో ఉన్న డీకే అరుణను ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో ఓటమి భయం వెంటాడుతోందట.
దేశంలో మోడీగాలి గట్టిగానే వీస్తున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ తుఫానును తట్టుకుని తాను నిలబడతానా అనే డైలమాలో జేజమ్మ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినవారే అవ్వడంతో.. మహబూబ్‌నగర్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పేరుకు వంశీచంద్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా.. ఈ స్థానాన్ని గెలిచే బాధ్యత పూర్తిగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఈ పార్లమెంట్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన స్వయంగా మానిటర్ చేస్తున్నారు.
ప్రచారం మొదలుకుని మద్దతు కూడగట్టేవరకూ ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నట్టు కాంగ్రెస్‌లో టాక్ నడుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మొదటి టార్గెట్ ఐతే డీకే అరుణను ఓడించడం సెకండ్ టార్గెట్‌గా పెట్టుకున్నారట రేవంత్ రెడ్డి. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచీ అరుణతో ఆయనకు ఉన్న విభేదాల గురించి జిల్లా మొత్తం తెలుసు. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్‌కు సంబంధించి ఏ మీటింగ్ పెట్టినా.. అరుణపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అరుణ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చినప్పటికీ.. పార్లమెంట్‌లో మాత్రం గాలి కాంగ్రెస్‌వైపే వీస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఒక కారణమైతే.. డీకే అరుణ స్వయంకృత అపరాధాలు కూడా ఆమెను ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఇవన్నీ కలిపి ఈసారి డీకేకు మహబూబ్‌నగర్‌లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలే ఉన్నట్టు తెలుస్తోంది.