ఆ పడవలు వైసీపీవే…? పడవలపై డీజీపీ ఫోకస్
ఇటీవల ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద వచ్చిన సమయంలో కొట్టుకు వచ్చిన పడవలపై ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీ కొట్టిన పడవుల యజమానుల ఆచూకీ కనుగొన్నారు పోలీసులు.
ఇటీవల ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద వచ్చిన సమయంలో కొట్టుకు వచ్చిన పడవలపై ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీ కొట్టిన పడవుల యజమానుల ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెం కు చెందిన కోమటి రామ్మోహన్ పడవులుగా వాటిని గుర్తించారు. అవి వైసీపీ నేతవిగా పోలీసుల విచారణలో వెల్లడి అయింది.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆద్వరంలోనే ఈ పడవులు నడిచినట్లు గుర్తించిన పోలీసులు… ఆ దిశగా విచారణ ముమ్మరం చేసారు. ప్రస్తుతం నందిగామ సురేష్ ఆధ్వర్యంలో మీ పడవలు నడుస్తున్నయా లేదా అనేది ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. కుట్ర కోణం వెలికి తీసేందుకు విచారణను వేగవంతం చేసారు. ఈ కేసు విషయంలో ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని పోలీసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బోట్లను ఢీ కొట్టిన వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.