REVANTH WHY : రేవంత్ జాగ్రత్త పడుతున్నారా ? ముందుచూపుతోనే మోడీతో అలా…

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చనువుగా వ్యవహరించడంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నిధుల వస్తాయా... మోడీతో చనువుగా మాట్లాడితే తప్పేంటని రేవంత్ సమర్థించుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 11:37 AMLast Updated on: Mar 06, 2024 | 11:48 AM

Are You Careful Revanth Thats How With Modi

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చనువుగా వ్యవహరించడంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నిధుల వస్తాయా… మోడీతో చనువుగా మాట్లాడితే తప్పేంటని రేవంత్ సమర్థించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…. రేవంత్ మరో ఏక్ నాథ్ అవుతారని ఆరోపిస్తే… మోడీ తెలంగాణకు ఏం చేశాడని పెద్దన్న అంటున్నావని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితోనే మోడీకి దగ్గర వాడిగా నటిస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది.

చేవెళ్ళ సభలో గుజరాత్ మోడల్ అంటే రైతులను చంపడమేనా అన్న సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పుడు తెలంగాణను కూడా గుజరాత్ లో అభివృద్ధి చేయాలని మోడీని కోరారు. పైగా మాజీ సీఎం కేసీఆర్… కేంద్రంతో గొడవ పెట్టుకొని రాష్ట్రానికి నిధులు రాకుండా చేశాడని ఆరోపించారు. మోడీతో రేవంత్ రాసుకు పూసుకు తిరగడం… భడే భాయ్ అనడం చూస్తుంటే… ఇంతలో ఎంత మార్పు… మూడు నెలల్లోనే రేవంత్ ఎందుకిలా మారాడని అందరికీ డౌట్. కానీ రేవంత్ ముందు జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని… పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నాడని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో మోడీ, అమిత్ షాకు కోపం వస్తే… ఎలాంటి ప్రభుత్వాలైనా కుప్పకూలతాయని అందరికీ తెలుసు. మహారాష్ట్రలో జరిగింది అదే. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సంక్షోభం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వాన్ని కూడా కూలుస్తున్నారన్న టాక్ ఉంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ వెనుక అర్థం ఇదే అంటున్నారు. ఇలాంటి టైమ్ లో మోడీతో అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకని రేవంత్ భావించినట్టు తెలుస్తోంది. మోడీతో ఇంత చనువుగా ఉండి… రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటిస్తూ… మంచి గౌరవం ఇస్తున్న రేవంత్ సర్కార్ కూలదోయాల్సిన అవసరం బీజేపీకి ఏముంటుంది. మోడీ అంటే గౌరవమని నిరూపించుకున్నారు… ఇప్పుడు రేవంత్ మీద కూడా గౌరవం ఉంటుంది కదా… అంటున్నారు.
ఓ వైపు రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు… మోడీని విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి ఈటైమ్ లో మోడీతో రేవంత్ చనువుగా వ్యవహరించడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ ఏమని సమాధానం చెబుతారన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ లో అనుమానాలు రావడానికి బీఆర్ఎస్ లీడర్లు కూడా ఆజ్యం పోస్తున్నారు. కానీ తెలంగాణకు నిధులు కావాలని ప్రధాని మోడీతో మాట్లాడితే తప్పేంటి అని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో కష్టపడి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు రేవంత్ రెడ్డి. అందువల్ల హైకమాండ్ ఆయన్ని అనుమానించే అవకాశం లేదని వాదిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను ఎలా డీల్ చేయాలని రేవంత్ కి బాగా తెలుసంటున్నారు కొందరు లీడర్లు. కానీ రేవంత్ మాత్రం ముందుచూపుతోనే మోడీకి దగ్గరివాడిగా నటించినట్టు అర్థమవుతోంది.