Chiranjeevi: చిరు..త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు

చిరంజీవి, త్రివిక్రమ్‌ కాంబోలో సినిమా వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్‌ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఎనౌన్స్‌ చేసినా.. ఆ ఊసే లేదు. వున్నట్టుండి.. చిరంజీవి డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ పేరు వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2023 | 06:45 PMLast Updated on: Oct 05, 2023 | 6:45 PM

Are You Ready To Make A Movie In Chiranjeevi Trivikram Combination

చిరంజీవి, త్రివిక్రమ్‌ కలయికలో సినిమా ఇంతవరకు రాకపోయినా.. జై చిరంజీవా సినిమాకు త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించాడు. సినిమా ఫ్లాప్‌ అయినా.. డైలాగ్స్‌ హిట్టయ్యాయి. వినయ విధేయ రామ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవే త్రివిక్రమ్‌ డైరెక్షన్‌ సినిమా వుంటుందని ఎనౌన్స్‌ చేసి షాక్‌ ఇచ్చాడు.

చిరంజీవి ఎనౌన్స్‌మెంట్ తప్ప త్రివిక్రమ్‌తో మూవీ ప్రాక్టికల్‌గా వర్కవుట్‌ కాలేదు. వున్నట్టుండి మెగాస్టార్‌ను త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడన్న వార్త బైటకొచ్చింది. త్రివిక్రమ్‌ మహేశ్‌తో తీస్తున్న గుంటూరుకారం సంక్రాంతికి రిలీజ్‌ అవుతోంది. ఆతర్వాత బన్నీతో మూవీ ఎనౌన్స్‌ చేసినా.. 2024 ఆగస్ట్‌ వరకు బన్నీ పుష్ప2తోనే వుంటాడు. ఈలోగా.. త్రివిక్రమ్‌ చిరంజీవిని డైరెక్ట్ చేయొచ్చని సమాచారం.

కథ రెడీగా వుంటే.. నాలుగైదు నెలల్లో త్రివిక్రమ్‌ సినిమా తీసేస్తాడు. సంక్రాంతిని టార్గెట్‌ చేసి.. నాలుగు నెలల్లో నాన్‌స్టాప్‌గా గుంటూరుకారం ను పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్యనే మొదలైనట్టున్న గుంటూరుకారం.. ఈనెల 20 నాటికి టాకీ పూర్తి చేసుకుంటుంది. ఈలెక్కన కథ సిద్ధంగా వుంటే.. బన్నీ సినిమా మొదలయ్యేలోగా.. చిరంజీవి సినిమాను ఫినిష్‌ చేసేస్తాడు.

చిరంజీవి 156వ సినిమాను కూతురు సుస్మిత నిర్మిస్తోంది. అయితే దర్శకుడిని ఎనౌన్స్‌ చేయలేదు. 157వ సినిమా వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. త్రివిక్రమ్‌ మూవీ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వుంటుందని చిరంజీవి ఎనౌన్స్‌ చేసినా.. కూతురు కోసం ఛేంజ్‌ చేస్తాడేమో చూడాలి మరి.