ARVIND KEJRIWAL-KAVITHA: చెప్పేటందుకే నీతులు.. మద్యం వద్దని.. అదే కేసులో అరెస్టైన కవిత, కేజ్రీవాల్
కేజ్రీ అరెస్ట్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. మద్యంలాంటి అవినీతికి వ్యతిరేకంగా తామిద్దరం కలసికట్టుగా ఉండి పోరాడామన్నారు. కానీ ఇప్పుడు తానే మద్యం తయారు చేయిస్తున్నాడని అన్నారు.
ARVIND KEJRIWAL-KAVITHA: ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు ఖచ్చితంగా సూట్ అవుతుందేమో. ఒకప్పుడు మద్యాన్ని బ్యాన్ చేయాలని మాట్లాడిన వీళ్ళే.. ఇప్పుడు లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిపోయారు. కమీషన్లకు కక్కుర్తిపడి కటకటాల పాలయ్యారు. ఒకప్పుడు అవినీతిపై యుద్ధం ప్రకటించి.. ఉద్యమించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. కేజ్రీ అరెస్ట్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు.
TDP THIRD LIST: చంద్రబాబు ఎవరికి హ్యాండ్ ఇచ్చారంటే..
మద్యంలాంటి అవినీతికి వ్యతిరేకంగా తామిద్దరం కలసికట్టుగా ఉండి పోరాడామన్నారు. కానీ ఇప్పుడు తానే మద్యం తయారు చేయిస్తున్నాడని అన్నారు. లిక్కర్ పాలసీ ఆపాలని కేజ్రీవాల్‌కు చాలా సార్లు లేఖలు రాశాననీ.. కానీ అరవింద్ తన మాట వినలేదని చెప్పారు అన్నా హజారే. మద్యం వల్ల హత్యలు పెరుగుతాయి.. మహిళలు చిత్రహింసలు అనుభవిస్తారనీ.. అందుకే ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఆపాలని తాను కోరినట్టు చెప్పారు. తన మాట వినకుండా మద్యం పాలసీని కేజ్రీవాల్ తీసుకొచ్చారనీ.. ఇప్పుడు అదే పాలసీ వల్ల అరెస్ట్ అయ్యాడన్నారు అన్నా హజారే. లిక్కర్‌పై ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన ఓ వీడియో కూడా ఈమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారని ఓ యాంకర్ అడిగితే.. లిక్కర్ బ్యాన్ చేస్తా అని సమాధానం ఇచ్చారు కవిత. లిక్కర్ వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనీ.. ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా ఫర్లేదు.. లిక్కర్‌ను బ్యాన్ చేస్తానని చెప్పుకొచ్చారు కవిత.
చాలా కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో కవిత ఈ విషయం చెప్పారు. మద్యం అనేది మహిళలకు శాపం లాంటింది. దీంతో ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసినా.. ఈ కేసులోనే కవిత ఇరుక్కోవడం విచిత్రం. తమకే పాపం తెలియదని మొన్నటిదాకా కేజ్రీవాల్, కవిత బుకాయించినా.. సాక్ష్యాలు, అప్రూవర్స్ స్టేట్‌మెంట్స్ సేకరించి పక్కాగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్, కవితకు తిహార్ జైలు శిక్ష తప్పేలా లేదు. అంటే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయా.. పొలిటికల్ లీడర్లు చెప్పేదొకటి చేసేది మరొకటా అని జనం మండిపడుతున్నారు.