Game Changer : డేంజర్‌లో గేమ్‌ఛేంజర్.. చెర్రీ ఫ్యాన్స్‌కు శంకర్ టెన్షన్..
భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా.. శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది.

As a sequel to Bharatiyadudu movie.. Bharatiyadudu 2 which came in the combo of Shankar and Kamal Haasan spelled disappointment..
భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా.. శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది. ఫస్ట్ పార్ట్‌లో భారతీయుడు తాత గూస్‌బంప్స్ తెప్పిస్తే.. సెకండాఫ్‌లో ముసలోడు నిరాశపరిచాడు అంటూ.. కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు2 తీసుకొచ్చారు. ఐతే ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. శంకర్ టేకింగ్, కమల్ యాక్టింగ్‌కు వేలెత్తే మ్యాటరే లేదు. ఐతే స్టోరీనే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యేలా లేదనే టాక్ వినిపిస్తోంది. ఐతే ఇదే ఇప్పుడు రాంచరణ్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టిస్తోంది.
శంకర్ నెక్ట్స్ మూవీ గేమ్‌ఛేంజర్.. రాంచరణ్ ఈ సినిమాలో హీరో. మరి భారతీయుడు 2 ఎఫెక్ట్.. గేమ్‌ఛేంజర్ పడుతుందా అనే గుబులు చెర్రీ ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. కొంతకాలంగా కథల విషయంలో శంకర్ ఎందుకో తడబడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఐ, రోబో 2.0ల విషయంలో అదే ప్రూవ్ అయింది. అసలు రీమేక్‌లకు దూరం అని కెరీర్ మొదట్లో గప్పాలు కొట్టి శంకర్.. చివరికి త్రీ ఇడియట్స్ మూవీని రీమేక్ చేశారు. ఆ సినిమా తర్వాత ఎంచుకున్న కథలన్నీ.. శంకర్ రేంజ్ అనిపించలేదు. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలోనూ అదే జరిగింది. పాత శంకర్ కనిపించడం లేదు అనే కామెంట్స్ మొదలయ్యాయ్. దీంతో గేమ్‌ఛేంజర్ చిత్రాన్ని శంకర్ ఎలా డీల్ చేశారో అనే టెన్షన్‌లో చెర్రీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదే తీరు కంటిన్యూ అయితే.. గేమ్‌ఛేంజర్.. డేంజర్‌లో ఉన్నట్లే అనే చర్చ జరుగుతోంది.
ఇక చెర్రీ మూవీ విషయంలో జరుగుతున్న పరిణామాలు.. ఫ్యాన్స్ భయాలను మరింత రెట్టింపు చేస్తున్నాయ్. గేమ్‌ఛేంజర్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పైగా మూవీ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. జరగండి, జరగండి అని అప్పుడెప్పుడో ఓ సాంగ్ రిలీజ్ చేశారు. అదీ పెద్దగా ఎక్కలేదు. సినిమాకు సంబంధించి లీక్డ్ ఇమేజెస్ తప్ప.. పెద్దగా అప్‌డేట్ ఏం ఇవ్వలేదు శంకర్. ఇది ఫ్యాన్స్‌ను మరింత టెన్షన్ పెడుతుంది. అసలే ఫామ్‌లోని శంకర్.. చెర్రీకి సూపర్ సక్సెస్ ఇస్తారా లేదా అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఫ్యాన్స్ అంతా..