YS Jagan : అసెంబ్లీ సాక్షిగా.. జగన్‌కు చంద్రబాబు షాక్.. ఏంటంటే..
ఈ నెల 22నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయ్. ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగానికి అసెంబ్లీ సెక్రటరీ వివరాలు కూడా పంపించారు.
ఈ నెల 22నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయ్. ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగానికి అసెంబ్లీ సెక్రటరీ వివరాలు కూడా పంపించారు. 22న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయ్. ఐతే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జగన్‌కు భారీ షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు.
రోజుకో శ్వేతపత్రం పేరుతో.. జగన్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలను బయటపెడుతున్న చంద్రబాబు.. దెబ్బ అంతకుమించి అనేలా అసెంబ్లీలోనే వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. హామీలను పక్కదారి పట్టించేందుకే.. శ్వేతపత్రాలు అంటూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆన్సర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఏపీని పట్టిపీడిస్తున్న నిధుల కొరతకు గల కారణాలపై.. జనాలకు వివరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.
జగన్ సర్కార్ చేసిన అరాచకాలు.. హామీల అమలుకు ఇబ్బందిగా మారాయని.. వీటన్నిటిని గాడినపెట్టి మళ్లీ ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తానని జనాలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు, ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్‌పై అసెంబ్లీలోనే జగన్ ముందు శ్వేత పత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. నేరుగా అసెంబ్లీలో జగన్ ముందే ఈ శ్వేతపత్రాలను విడుదల చేయడం ద్వారా… జగన్‌ను ఇరుకున పెట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట.
రకరకాల మద్యం బ్రాండ్స్ పేరుతో వచ్చిన చీప్ లిక్కర్… వాటిని తాగడంతో జనాలు అనారోగ్యానికి గురవడం.. మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి జనాలను మోసం చేయడం.. ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా జగన్ తీసుకున్న నిర్ణయాలు.. ఇలాంటి అంశాలను అసెంబ్లీలోనే జగన్ ముందు ఎమ్మెల్యేలకు వివరించే విధంగా ప్లాన్ చేశారు చంద్రబాబు. వీటితో వైసీపీ చేస్తున్న విమర్శలకు చెక్‌పెట్టొచ్చని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీనికోసం అసెంబ్లీనే వేదికగా మార్చుకుటున్నారని తెలుస్తోంది.