Chandrababu: చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడగింపు !?
చంద్రబాబు కస్టడీ పొడిగిస్తారా.. బెయిల్ మంజూరు చేస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

As Chandrababu's custody period ends today, doubts are being raised whether he will get bail or not
స్కిల్ స్కాం కేసుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు కస్టడీ పొడగింపు నేటితో ముగియనుంది. సీఐడీ అధికారులు క్వశ్చనింగ్ కూడా ఇవళ పూర్తవుతుంది. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబుతో ఏసీబీ జడ్జ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే చాన్స్ ఉంది. దీంతో తరువాత ఏం జరగబోతోంది అనే టెన్షన్ టీడీపీ నేతల్లో మొదలైంది. నిజానికి రెండు రోజుల ముందే చంద్రబాబు 14 రోజుల రిమాండ్ ముగియాల్సి ఉంది. కానీ ఆయనను కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వాదించడంతో రెండు రోజులు రిమాండ్ పొడగించి కస్డడీకి ఇచ్చింది కోర్టు. మొత్తం స్కాం వ్యవహారంలో 120 ప్రశ్నలు చంద్రబాబును అడిగారు సీఐడీ అధికారులు.
ఈ కస్టడీ అనతరం చంద్రబాబును రిమాండ్ పొడిగించాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరబోతున్నట్టు సమాచారం. మరో రెండు రోజుల పాటు రిమాండ్ పొడగించి.. కస్టడీ కూడా పొడగించాలని జడ్జిని అధికారులు కోరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చంద్రబాబు లాయర్లు బెయిల్ పిటిషన్ వేసి సిద్ధంగా ఉన్నారు. కస్టడీకి ఇచ్చిన కారణంగా బెయిల్ విషయంలో వాదనలు వినబోనంటూ ఏసీబీ జడ్జ్ చెప్పారు. ఇవాళ కస్టడీ ముగియడంతో బెయిల్ విషయంలో కూడా వాదనలు జరిగే చాన్స్ ఉంది. ఇవాళ సాయంత్రం సీఐడీ కస్టడీతో పాటు చంద్రబాబు రిమాండ్ కూడా ముగుస్తుంది. దీని తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.