రూ.500 కోట్లు కూడా సరిపోవు, బూమ్రాపై నెహ్రా కామెంట్స్
గతవారం జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ను సొంతం చేసుకుంది.
గతవారం జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ను సొంతం చేసుకుంది. ఈ వేలంలోనే శ్రేయాస్ అయ్యర్ 26.7 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాసేపట్లోనే ఈ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. మొత్తం మీద కొందరు స్టార్ ప్లేయర్స్ ఈ సారి భారీగానే బిడ్లు దక్కించుకోగా.. మరికొందరికి నిరాశే మిగిలింది. అయితే వేలంలో 27 కోట్లకే అందరూ వామ్మో అని ఆశ్చర్యపోతే… టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మెగా వేలంలోకి వచ్చి ఉంటే ఏకంగా 520 కోట్ల పర్సు వ్యాల్యూ కూడా సరిపోదని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ మెగా వేలంలోకి బుమ్రా వస్తే అన్ని ఫ్రాంచైజీ జట్లు అతని కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయన్నాడు.
బుమ్రా కూడా ఆక్షన్ బరిలోకి దిగితే సీన్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చాడు. అతను ఈజీగా 500 కోట్లు దక్కించుకునే వాడు అంటూ చమత్కరించాడు. బూమ్రాకు ఉన్న డిమాండ్ అలాంటిదన్నాడు. ఈ మధ్య కాలంలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతంగా ఉందన్న నెహ్రా కెరీర్‌లో ఇప్పుడు అతను పీక్స్‌లో ఉన్నాడని విశ్లేషించాడు. పెర్త్ టెస్ట్‌లో బౌలర్‌గా రాణించడమే గాక కెప్టెన్‌గానూ మెప్పించాడన్నాడు. రోహిత్ శర్మ స్థానంలో సారథిగా ఒత్తిడిని తీసుకొని జట్టును గెలిపించాడని గుర్తు చేశాడు. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అయిన టీమ్‌ను అతడు ముందుండి నడిపించిన విధానం అదిరిందంటూ నెహ్రా వ్యాఖ్యానించాడు.
సాధారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ 120 కోట్లకు మించి ఉండదు.. అలాంటిది 500 కోట్లు అంటూ బూమ్రా గొప్పతనాన్ని నెహ్రా ఇలా చమత్కరించాడు. టీ ట్వంటీ ఫార్మాట్ లోనూ బూమ్రాకు అద్భుతమైన రికార్డుంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొని భారీ షాట్లు కొట్టడం బ్యాటర్లకు కష్టమే.. గతంలో ఎన్నోసార్లు ఇది రుజువైంది కూడా… అందుకే బూమ్రా లాంటి బౌలర్ ను ముంబై ఇండియన్స్ ముందే రిటైన్ చేసుకుంది.