క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా స్పిన్ సైంటిస్ట్ ఆర్ అశ్విన్ గుడ్ బై చెప్పాడు. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా స్పిన్ సైంటిస్ట్ ఆర్ అశ్విన్ గుడ్ బై చెప్పాడు. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 38 ఏళ్ల స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టులలో భారత్ తరఫున అత్యధిక వికెట్ లు తీసిన రెండో బౌలర్. అశ్విన్ 106 టెస్ట్ లు ఆడి… 537 వికెట్ లు తీసాడు.
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా క్రికెట్ నుంచి నిలిచాడు అశ్విన్. అతని కంటే ముందు అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ లో కూడా రాణించి ఆరు సెంచరీలు 14 ఆఫ్ సెంచరీలు చేసాడు. వన్డేల్లో 156 వికెట్లు తీసాడు. లీగ్ క్రికెట్ లో మాత్రం అశ్విన్ కొనసాగనున్నాడు.