Asia cup: గంభీర్‌పై మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం.. కారణమేంటంటే?
కోహ్లీ అభిమానులు మరోసారి గంభీర్‌పై మండిపడ్డారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
పాకిస్థాన్‌పై కోహ్లీ మరోసారి రఫ్పాడించాడు. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. 130 స్ట్రైక్‌రేట్ పాక్ ఫీల్డర్లను కోహ్లీ పరుగులు పెట్టించాడు. బౌలర్లు తలలు పట్టుకునేలా చేశాడు. అటు కేఎల్ రాహుల్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 357 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదిరే ఆటతో పాక్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసి పాక్ మిడిలార్డర్ వెన్నువిరిచాడు. గేమ్ తర్వాత జరిగే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటెషన్‌కి ముందు గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అందరూ చెప్పిన ఓపెనియన్‌కి డిఫెరెంట్‌గా చెప్పే గంభీర్ మరోసారి అలానే మాట్లాడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇవ్వాలి అన్న డిస్కషన్ నడుస్తుండగా.. కుల్దీప్‌కి యాదవ్‌కి ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు గంభీర్. అయితే దీనికి బలమైన కారణాలు చెప్పాడు. కోహ్లీ, రాహుల్ సెంచరీతో అద్భుతంగా ఆడారని చెబుతూనే.. కుల్దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. కోహ్లీ, రాహుల్‌తో పాటు రోహిత్, గిల్ కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చారన్న గంభీర్.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్‌ని స్పెషల్‌గా ప్రశంసించాడు.
సీమ్, పేసర్లకు అనుకులిస్తున్న పిచ్‌పై ఒక స్పిన్నర్ 8 ఓవర్లు వేసి 5 వికెట్లు తీయడం చిన్న విషయం కాదన్నాడు గంభీర్. పాకిస్థాన్ బ్యాటర్లు స్పిన్ ఆడడంలో ఎక్స్‌పర్ట్స్ అని.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బ్యాటర్లను అవుట్ చేస్తే పెద్ద విషయం అవ్వకపోవచ్చు కానీ.. స్పిన్ ఆడడంతో ఆరితేరిన బాబర్ టీమ్‌ని పేకమేడలా కూల్చడం గొప్ప విషయమన్నాడు గంభీర్. కుల్దీప్ ఈ విధంగా బౌలింగ్ చేయకపోయి ఉంటే పాక్ బ్యాటర్లు కూడా రెచ్చిపోయి ఉండేవారేమోనని అభిప్రాయపడ్డాడు. గంభీర్ వ్యాఖ్యలతో కొంతమంది ఏకీభవిస్తుండగా.. మరికొంతమంది మాత్రం కోహ్లీపై విషం చిమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్‌కి ఏం పనిపాటా ఉండదని.. నిత్యం కోహ్లీపై ఏడవడమే పనిగా పెట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే గంభీర్ ఎక్కడా కూడా కోహ్లీని తక్కువ చేయలేదు. కుల్దీప్‌కి ఇస్తే బాగుంటుందని చెప్పాడు. అది కూడా సిమ్ పిచ్‌పై స్పిన్నర్ చెలరేగడం.. స్ట్రాంగ్ స్పిన్ ప్లేయర్లయినా పాక్ బ్యాటర్లపై రెచ్చిపోవడంతో తన ఓపెనియన్ చెప్పాడు. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడైనా కూడా బ్యాటర్ల ఫెవర్‌గానే ఉంటుందన్నది అందరికి తెలిసిన నిజమే!