Asia Cup: ఈరోజు వానపడితే మళ్ళీ పాక్ తో మ్యాచ్
ఇంటర్నేషనల్ క్రికెట్ లో భారత్, నేపాల్ తొలిసారి తలబడబోతున్నాయి.

Asia Cup 2023 will be the first international match between Nepal and India
ఆసియా కప్ 2023 టోర్నీ 5వ మ్యాచ్‌లో భారత్, నేపాల్ తలపడబోతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, నేపాల్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో నేపాల్‌పై విజయం సాధిస్తేనే.. రోహిత్ సేన సూపర్ 4 రౌండ్‌కి చేరుకుంటుంది. మరోవైపు గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ ముందుగానే సూపర్ 4కు చేరుకుంది. ఈ క్రమంలోనే నేపాల్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవడం తప్పనిసరిగా మారింది. వర్షం కారణంగా రద్దయిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన పల్లెకలె మైదానంలోనే నేటి మ్యాచ్ కూడా జరగనుంది.
భారత్, నేపాల్ మధ్య జరిగే నేటి మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ విజయం రోహిత్ సేనకు కీలకం కాగా, ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్, నేపాల్‌కి చెరో పాయింట్ లభిస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ రద్దవడం ద్వారా 1 పాయింట్ పొందిన భారత్.. మొత్తం 2 పాయింట్లతో నేరుగా సూపర్ 4 రౌండ్‌కి చేరుతుంది. అదే జరిగితే సూపర్ 4 దశలో భారత్, పాక్ మ్యాచ్ కొలొంబో వేదికగా మరో సారి జరుగుతుంది. అలాగే ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ఆడుతున్న నేపాల్ నిరాశతో ఇంటి బాట పడుతుంది.