Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లి చేసింది ఈ పూజారే.. దక్షిణ ఎంత ఇచ్చారో తెలిస్తే మతి పోద్ది
ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి దశాబ్దాలు గుర్తుండిపోయేలా జరిగింది.

Asia's richest man Mukesh Ambani's youngest son Anant Ambani's wedding was held to be remembered for decades.
ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి దశాబ్దాలు గుర్తుండిపోయేలా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వైభవంగా మాత్రమే కాదు.. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా.. దైవత్వం కనిపించేలా జరిగింది. దేశవిదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ వివాహ వేడకలో భాగమయ్యారు. పెళ్లిలో సనాతన సంస్కృతిని భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం మొత్తం చాలా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది.
ఈ వివాహ వేడుకల కోసం కోట్ల రూపాయలను ఖర్చుచేసిన అంబానీ కుటుంబం.. వచ్చిన అతిథులకు అంతే స్థాయిలో బహుమతలు అందించింది. భారతీయ ఆచారాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఈ పెళ్లి జరిపించిన పూజారి గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. అంబానీ వివాహం జరిపించిన పండితుడు ఎవరు ? అయనకు ఎంత దక్షిణ సమర్పించి ఉంటారనేది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ జ్యోతిష్యుడు, పూజారి, పర్సనల్ కోచ్, లైఫ్‌స్టైల్ మోటివేటర్‌గా ఉన్న పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ పెళ్లి జరిపించారు. చంద్రశేఖర్ శర్మ చేతుల మీదుగానే అంబానీ కుటుంబంలో పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు జరుగుతాయి.
గుజరాత్ జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా చంద్రశేఖర్ శర్మ ఉన్నారు. సాధారణంగా పండిట్ చంద్రశేఖర్ శర్మ వివాహ ఆచారాలను నిర్వహించడానికి 25 వేలు మాత్రమే తీసుకుంటారు. ఇందులో దానికి అవసరమైన సామగ్రి కూడా ఉంటుంది. అయితే, అనంత్ అంబానీ వివాహ వేడుకల కోసం ఆయనకు అంబానీ కుటుంబం లక్షల్లో దక్షిణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది కాకుండా ఆయన ఉండేందుకు లగ్జరీ వసతులతో పాటు ఖరీదైన బహుమతులు అందించారని సమాచారం.