2023 Election Schedule : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. ఎన్నికల తేదీలు.

దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ , మధ్యప్రదేశ్ లో ఒకే విడుతలో, ఛత్తీస్ గఢ్ లో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2023 | 02:43 PMLast Updated on: Oct 09, 2023 | 2:44 PM

Assembly Elections Of Five States Including Telangana Have Rang In The Country Central Election Commission Chief Election Commissioner Rajeev Kumar Has Released The Election Schedule

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలున్నాయి.  16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించాం.  సీఈసీ ప్రధాన పార్టీలతో.. ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్‌ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్.. నవంబర్‌ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 15.. నవంబర్‌ 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు – ఈసీ

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు..

ఎన్నికల తేదీలు విడుదల చేసిన ఎలక్షన్ కమీషన్.

మిజోరం..

  • అక్టోబర్ 13 – ఎన్నికల నోటిఫికేషన్
  • నవంబర్ 7 – పోలింగ్
  • డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

 

మిజోరాం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 13న నోటిఫికేషన్‌, 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 23.. పోలింగ్‌ నవంబర్‌ 7, ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3-కేంద్ర ఎన్నికల సంఘం.

రాజస్థాన్..

  • అక్టోబర్ 30 – ఎన్నికల నోటిఫికేషన్
  • నవంబర్ 23 – పోలింగ్
  • డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

 

రాజస్థాన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 30న నోటిఫికేషన్‌, నవంబర్‌ 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 7న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 9.. పోలింగ్‌ నవంబర్‌ 23, ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3-కేంద్ర ఎన్నికల సంఘం.

ఛత్తీస్గఢ్..

  • అక్టోబర్ 13 – ఫేజ్-1 ఎన్నికల నోటిఫికేషన్
  • అక్టోబర్ 21 ఫేజ్-2 ఎన్నికల నోటిఫికేషన్
  • నవంబర్ 7 – ఫేజ్-1 పోలింగ్
  • నవంబర్ 17 ఫేజ్-2 పోలింగ్
  • డిసెంబర్ 3 – ఫేజ్-1 & ఫేజ్- 2 ఎన్నికల ఫలితాలు

 

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. రెండు విడతలుగా ఎన్నికలు.. తొలి విడదతకు అక్టోబర్‌ 13న నోటిఫికేషన్‌, అక్టోబర్‌ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 23.. పోలింగ్‌ నవంబర్‌ 7వ తేదీ.. రెండో దశకు అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌, అక్టోబర్‌ 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 2.. పోలింగ్‌ నవంబర్‌ 17, ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3న-కేంద్ర ఎన్నికల సంఘం

మధ్యప్రదేశ్..

  • అక్టోబర్ 21 – ఎన్నికల నోటిఫికేషన్
  • నవంబర్ 17 – పోలింగ్
  • డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

 

మధ్యప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌, 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 2.. పోలింగ్‌ నవంబర్‌ 17, ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3-కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ..

  • నవంబర్ 3 – ఎన్నికల నోటిఫికేషన్
  • నవంబర్ 30 – పోలింగ్
  • డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం..
తెలంగాణలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. నవంబర్‌ 3న నోటిఫికేషన్.  నవంబర్‌ 10 వరకు నామినేషన్ల స్వీకరణ. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్‌ 15 చివరి తేదీ. నవంబర్‌ 30న పోలింగ్‌.  డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు విడుదల.

S.SURESH