కనీసం 20 కోట్లు పెట్టాల్సిందే రోహిత్ పై అశ్విన్ కామెంట్స్

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ జాబితాలపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తుండగా... పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రానున్నారు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడంపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 05:22 PMLast Updated on: Oct 14, 2024 | 5:22 PM

At Least 20 Crores Should Be Invested Ashwin Comments On Rohit

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ జాబితాలపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తుండగా… పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రానున్నారు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడంపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు. రెండు,మూడు ఫ్రాంచైజీలు ఖచ్చితంగా అతన్ని కోసం ఎంతైనా వెచ్చించేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు క్రికెట్ వర్గాల్లోనూ రోహిత్ ధరపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని ధర పలుకుతాడంటూ కొందరు అంచనా వేస్తున్నారు. తాజాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడా అన్న ప్రశ్నకు స్పందించాడు.

తన సొంత యూట్యాబ్ ఛానెల్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు యాష్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. రోహిత్ , కోహ్లీ కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభిస్తే చూడాలని ఉందని, హిట్ మ్యాన్ కెప్టెన్సీ అందుకుంటే బెంగళూరు గెలుస్తుందంటూ చెప్పిన ఆ అభిమాని చెప్పాడు. దీనికి రిప్లై ఇచ్చిన అశ్విన్ రోహిత్ ను తీసుకోవాలనుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనీసి 20 కోట్లు పక్కన పెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
వీరిద్దరూ చిన్నస్వామి లాంటి స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే ఫ్యాన్స్ కు పండగేనంటూ ఈ చర్చలో పాల్గొన్న మరో అభిమాని చెప్పుకొచ్చాడు.

కాగా హార్థిక్ పాండ్యాను కెప్టెన్ చేసిన తర్వాత హిట్ మ్యాన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరుపై బహిరంగంగా ఏం మాట్లాడకున్నప్పటకీ వేలంలోకి వెళ్ళేందుకు రోహిత్ నిర్ణయించుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రోహిత్ ఇప్పటి వరకూ స్పందించలేదు. అటు ముంబై రిటైన్ జాబితాలో రోహిత్ పేరు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.