Junior NTR : ఎన్నికల వేళ జూ.ఎన్టీఆర్ షర్ట్ కలర్‌పై రచ్చ
ఎపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడూ లేని స్థాయిలో ఓటర్లు ఓట్లు వేసేందుకు ఏపీకి తరలివెళ్తున్నారు. వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, విదేశాల్లో ఉండేవాళ్లు కూడా ఈ ఎన్నికల కోసం ఏపీకి వస్తున్నారు.
ఎపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడూ లేని స్థాయిలో ఓటర్లు ఓట్లు వేసేందుకు ఏపీకి తరలివెళ్తున్నారు. వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, విదేశాల్లో ఉండేవాళ్లు కూడా ఈ ఎన్నికల కోసం ఏపీకి వస్తున్నారు. ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతోంది అని నిర్ణయించాల్సిన సమయం వేళ.. జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ కలర్ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇవాళ ఇదయం జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగింజుకున్నాడు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో భార్య తల్లితో కలిసి ఓటు వేశాడు.
ఈ ఓటింగ్‌కి ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీకి ఇండైరెక్ట్‌గా తన మద్దతు తెలిపేందుకే ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని వైసీపీ కార్యకర్తలు పోస్ట్‌లు చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఉన్న తగాదాలను హైలెట్ చేస్తూ ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్లు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ గెలవడం ఎన్టీఆర్‌కు ఇష్టం లేదని.. అందుకే ఆ పార్టీ కలర్ వేసుకురాలేదని చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానించేవాల్లు అంతా ఆయనలాగే వైసీపీకి మద్దతు తెలపాలని కోరుతున్నారు. దీనికి టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు కూడా ఇస్తున్నారు.
ఇక రంగుల రాజకీయాన్ని వదిలిపెట్టారా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన ఏదో క్యాజువల్‌గా బ్లూ షర్ట్ వేసుకుంటే దాన్ని కూడా రాజకీయానికి లింక్ చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎలాగూ ఈ ఎన్నికల్లో ఓడిపోతారు.. తరువాత ఇలాంటి పోస్టులు పెట్టుకోవడం తప్ప వైసీపీ కార్యకర్తలకు నేతలకు ఏం పని ఉండదంటూ చుకలంటిస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ల మాటల యుద్ధం ఎలా ఉన్నా.. జస్ట్ వేసుకున్న షర్ట్ కలర్‌ని రాజకీయాలకు లింక్ చేయడం దారుణమంటున్నారు ఈ పోస్ట్ చూసిన కామన్ నెటిజన్స్.