Japan Earthquake : కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం సునామీ వచ్చే అవకాశం.. ( ఫోటోలు )
యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రామాలు సిద్ధం చేసుకుంటునారు. ఒక్క దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున.. ఈ భారీ విపత్తును చెవి చూడాల్సి వచ్చింది. అదే అత్యథునిక టేక్నాలజీతో ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న జపాన్. న్యూ ఇయర్ రోజున జపాన్ వరుస భూకంపాలతో ఆ దేశాన్ని కుదిపేసింది. దీంతో టోక్యో లో.. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.6 గా భూకంప తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.

కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం

ప్రకృతి విప్పత్తుతో జపాన్ అల్లాడిపోతోంది.

నార్త్ సెంట్రల్ జపాన్ ప్రాంతంలో సోమవారం.. 21 భూకంపాలు సంభవించాయి.

నూతన ఏడాది తొలి రోజు ఆనందంగా గడుపుతున్న అక్కడి ప్రజలు.. వరుస భూకంపాలు, సునామీ కారణంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

అనేక చోట్ల రోడ్లు చీలిపోయాయి.

వీటిల్లో అత్యధికంగా 7.6 తీవ్రతతో భూమి కంపించింది.

స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి.

ఇవన్నీ 90 నిమిషాల వ్యవధిలో నమోదయ్యాయి.


భూకంపం ధాటికి జపాన్లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

వరుస భూకంపాల అనంతరం అక్కడి వాతావరణశాఖ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

కొంతసేపటికే.. 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి.


ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.

భూకంపం ధాటికి భారీగా హస్తీ నష్టం


జపాన్లో సునామీ, భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.



సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జపాన్లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది.



అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.


నోటో ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ని విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.




కూలిపోయిన భవనాల శిథిలాల నడుమ నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు నివేదించారు.



దీంతో జపాన్ కు మరో సారి సునామీ సంభవించే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

సోమవారం నుంచి దాదాపుగా 155 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భూపరిశోధన బృంధం తెలిపింది.


